Bigg Boss Telugu Season9: మరో నెల రోజుల్లో ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ సీజన్ కి లేనంత బజ్ ఈ సీజన్ కి ఏర్పడింది. అందుకు ముఖ్య కారణం, ఈ సీజన్ లో సామాన్యులకు కూడా కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి. గత సీజన్స్ లో సామాన్యుల క్యాటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ నుండి సానుభూతి దక్కేది. సామాన్యులపై సెలబ్రిటీలు అరిచినా, కోప్పడినా, నామినేషన్ చేసినా, ఎపిసోడ్ చాలా పీక్ ఎమోషన్ తో నడిచేది. ఒక్క సామాన్యుడు వస్తేనే అంత ఎమోషన్స్ పండినప్పుడు, ఈ సీజన్ లో ఏకంగా 8 మంది వస్తున్నారు, ఇక ఏ రేంజ్ లో ఈ సీజన్ ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఈ కాన్సెప్ట్ ని పరిచయం చేసినప్పుడే బ్లాక్ బస్టర్ అనుకోవాలి.
Also Read: నాగార్జున తెలివి మాములుగా లేదుగా..?
ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ గురించి ఇండస్ట్రీ లో ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ప్రతీ సీజన్ లో ప్రైజ్ మనీ 50 లక్షల వరకు ఉంటుంది. కానీ ఈ సీజన్ లో ప్రైజ్ మనీ కోటి రూపాయిలు ఉంటుందని అంటున్నారు. కోటి రూపాయిలు సెలబ్రిటీలకు దక్కితే పెద్ద ఉపయోగం లేదు కానీ, అదే సామాన్యుడికి ఈ షో ద్వారా కోటి రూపాయిలు వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. లైఫ్ టైం సెటిల్మెంట్ రా అనే డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ డైలాగ్ ఈ సీజన్ లో సామాన్యులు గెలిస్తే పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది అనుకోవచ్చు. పాపులారిటీ ఎలాగో వస్తుంది, ఆ పాపులారిటీ తో పాటు డబ్బు కూడా తోడైతే జీవితం స్థిరపడినట్టే కదా. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే సామాన్యులను ఎంపిక చేసుకునే ప్రక్రియ రేపటి నుండి మొదలు కాబోతుంది.
Also Read: మహేష్ బాబు లుక్ తో సినిమా కథ మీద క్లారిటీ ఇచ్చిన రాజమౌళి…
లక్షల్లో వచ్చిన దరఖాస్తుల్లో, 200 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 200 మందిలో ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ వంటి రౌండ్స్ పెట్టి 40 మందిని ఫిల్టర్ చేశారు. ఈ 40 మందికి అగ్ని పరీక్ష అనే పోటీ పెట్టి కేవలం 8 మందిని పంపిస్తారు. ఈ అగ్నిపరీక్ష కాంటెస్ట్ కి సాధన నాయుడు అనే సామాన్యురాలు ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది. ఈ అగ్ని ప్రీక్షయా షూటింగ్ 10 రోజుల వరకు ఉంటుంది. ఈ పది రోజులు కంటెస్టెంట్స్ తమ మొబైల్ ఫోన్స్ ని లోపలకు తీసుకొని వెళ్లరాదట. లోపల జరిగే విషయాలు ఎట్టి పరిస్థితిలోనూ బయటకు తెలియకూడదు అట. ఒకవేళ తెలిస్తే అగ్నిపరీక్ష కాంటెస్ట్ నుండి తప్పుకున్నట్టే. ఆగష్టు 20 తర్వాత ఈ అగ్ని పరీక్ష కి సంబంధించిన ఎపిసోడ్స్ జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది.