Today horoscope in telugu ‘: గ్రహాలు మార్పు కారణంగా కొన్ని రాశుల ఫలితాలు మారిపోతుంటాయి. ఇదే సమయంలో కొన్ని నక్షత్రాల ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఆదివారం మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు ఒక కంపెనీ నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొందరు స్నేహితులు ధన సహాయం చేస్తారు. జీవిత భాగస్వామిగా సంతోషంగా ఉంటారు. గతంలో మొదలు పెట్టిన పనులు ఈరోజు పూర్తి అవుతాయి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తే ఓర్పుతో మెదలాలి. వ్యాపారులు పెట్టుబడులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు సమర్ధవంతంగా విధులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతాయి. డబ్బు గురించి ఎవరికీ హామీలు ఇవ్వద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): అనుకోకుండా ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. బంధుమిత్రుల నుంచి ధన సహాయమందుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. ఏదైనా వివాదం వస్తే ఓర్పుతో ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . . ఇండియన్ పల్లెలను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చేసే వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈరోజు వారు కష్టపడి ఏ పని చేసినా వెంటనే సానుకూల పలితాలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల విషయంలో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత రహస్యాలను ఎవరితో పంచుకోకుండా ఉండాలి. ఎవరి వద్దనైతే సహాయం పొందుతారు వారికి తిరిగి సహాయం చేస్తారు. ధన ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనవసరమైన వాగ్దానాలు చేయొద్దు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కన్య రాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభసాటి వార్తలు వినాల్సి వస్తుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ఇప్పటివరకు డబ్బులు ఇచ్చిన వారు సకాలంలో తిరిగి చెల్లిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల నుంచి ఈరోజు బయటపడతారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య సంయమనం పాటించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మికంగా ధన లాభం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు పరిస్తాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నైపుణ్యాలు ప్రదర్శించడంతో సమాజంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారు కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలవడంతో కొన్ని పనులు పూర్తవుతాయి. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తే ఇవి లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సంతోషాన్ని కలిగిస్తాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. గతంలో చేపట్టిన పనులు పూర్తి కావడంతో మరింత సంతోషంగా ముందుకు వెళ్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉండగలుగుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కొన్ని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు ఏ పని తలపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఊహించిన దానికంటే ధన లాభం ఎక్కువగా ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు పూర్తి చేయడంలో కష్టపడతారు. అయితే స్నేహితుల మద్దతుతో ధన సమస్యలు లేకుండా ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే వీరితో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఒక శుభకార్యం లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.