Fenugreek: మెంతికూర గొప్ప వైద్య గుణాలు కలిగిన అద్భుతమైన కూర. అందుకే కూరలన్నింటిలో కల్లా మెంతికూర రారాజు లాంటిది. సున్నం, భాస్యరము, ఇనుము తదితర సేంద్రియ లవణాలను సమృద్ధిగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. మీకు తెలుసా ? కేవలం 100 గ్రాముల మెంతికూరలో పోషక విలువలు ఎన్నో ఉన్నాయో ఈ క్రింది పట్టిక చూడండి.
పిండిపదార్థాలు = 9.5గ్రా.
క్రొవ్వు పదార్థాలు = 0.9గ్రా.
మాంసకృత్తులు = 4.9గ్రా
సున్నం (కాల్షియం) = 470గ్రా.
భాస్వరం. = 60మి గ్రా.
మెగ్నీషియం, ఇనుము. = 16.9గ్రా.
ఉప్పు (సోడియం), పొటాషియం, పీచు పదార్థం = 1.0మి గ్రా
శక్తి : = 67 కేలరీలు
Also Read: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి కుట్రలకు తావు లేదా?
అలాగే వైద్య సంబంధమైన ఉపయోగాలు ఎన్నో.. అవేంటో చూద్దామా !
ఉడికించిన మెంతి ఆకులు.. కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు మేలు చేస్తాయి
మెంతి ఆకులను బాగా రుబ్బి, స్నానం చేయడానికి ముందు తలపై బాగా మర్దనా చేస్తే కురులు బాగా పొడవుగా సాగుతాయి. చుండ్రు అరికట్టబడుతుంది. పిన్న వయసులోనే జట్టు తెల్లబడటం నివారించబడుతుంది.
మెంతి ఆకులను బాగా రుబ్బి ఆ పేస్ట్ ను బాలింతల స్తనాలపై రుద్దితే అనవసరంగా పాలు ఉత్పత్తి కాకుండా నిరోధించవచ్చు
మెంతి గింజలలో ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకుంటే మధుమేహాన్ని నివారించవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించవచ్చు. తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను బాగా తగ్గించవచ్చు.
Also Read: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. క్రికెట్ అభిమానులకు కోలుకోలేని షాక్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Uses of fenugreek
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com