https://oktelugu.com/

Zimbabwe Boy: ఆధునిక మోగ్లీ .. సింహాల అడవిలో తప్పిపోయి ఐదు రోజులు బతికిన అద్భుత పిల్లాడి గగుర్పొడిచే కథ

అలాంటి సింహం బోనులో చిక్కుకుని ప్రాణాలతో భయటపడిన ఓ బాలుడి కథ అందరనీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అడవి మధ్యలో ఎనిమిదేళ్ల బాలుడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్‌ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ.

Written By:
  • Rocky
  • , Updated On : January 4, 2025 / 06:22 PM IST

    Zimbabwe Boy

    Follow us on

    Zimbabwe Boy: సింహం ఒక క్రూర జంతువు. మృగాలకు రాజుగా ‘మృగరాజు’ అని సింహాన్ని పిలుస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 నుంచి 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 నుంచి 8 అడుగులు, బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది. అలాంటి అడవికి రాజైన సింహాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. జంతువులను చూసే సంరక్షకులు.. వాటితో చనువుగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

    అలాంటి సింహం బోనులో చిక్కుకుని ప్రాణాలతో భయటపడిన ఓ బాలుడి కథ అందరనీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అడవి మధ్యలో ఎనిమిదేళ్ల బాలుడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్‌ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. కానీ నిజ జీవితంలో ఇది జరిగింది. అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఈ బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు.

    ఈ బాలుడు దారి తప్పి దాదాపు 40 సింహాలు నివసించే మాటుసడోనా గేమ్ పార్కుకు 23 కిలోమీటర్ల దూరం నడిచాడు. కానీ, ఉత్తర జింబాబ్వేలోని హాగ్వే నదికి సమీపంలోని అడవిలో ఆ బాలుడు ఐదు రోజులపాటు జీవించగలిగాడు. మాటుసడోనా గేమ్ పార్క్ లో ప్రస్తుతం దాదాపు 40 సింహాలను కలిగి ఉంది. ఒకప్పుడు ఆఫ్రికాలో అతిపెద్ద సింహాల జనాభాను కలిగి ఉంది. ఈ పార్క్ 1,470 చదరపు కిలోమీటర్ల (570 చదరపు మైళ్ళు) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, జీబ్రాస్, ఏనుగులు, సింహాలు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది.

    అలాంటి పార్కులో ఆ బాలుడు పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. బతికాడు. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్‌ పార్క్‌.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎలా వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి దారి తెలియదు. అయితేనేం ధైర్యం కోల్పోలేదు. బతికేందుకు తనకు తెలిసిన విజ్నానాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు.

    ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న గుంతలు తవ్వుకుని అందులో ఊరిన నీటిన తాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండల పై నిద్ర పోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన తమ కొడుకు కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు బాలుడు తప్పి పోయిన విషయాన్ని తెలిపారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చింగ్ బృందం ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసింది.

    నాలుగు రోజుల పాటు వెతికి ఇక దొరకడని ఆశలు వదిలేసుకుంది. చివరి అవకాశంగా ఐదో రోజు పార్క్‌ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలిస్తుండగా వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి అధికారులు దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో ఆ బాలుడు ఇక్కడే ఉన్నాడని భావించారు. ఎట్టకేలకు బాలుడిని కనిపెట్టారు.