CM Jagan Sensational Comments: ఏపీ సీఎం జగన్ ప్రస్టేషన్ పీక్ స్టేజుకు వెళ్లిపోయిందా? విపక్షాలు, విపక్ష నేతలపై ఆయన అసహనంతో మాట్లాడుతున్నారా? సహజంగా తాడేపల్లి ప్యాలెస్ విడిచిపెట్టి బయటకు రాని ఆయనకు విక్షలన్నా, ప్రజలన్నా భయమా అంటే.. జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా ‘మారీచ భాష’ మాట్లాడుతున్న సీఎం జగన్ ‘పీకుడు’లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్షాలతోపాటు తన తప్పులను వేలెత్తి చూపిస్తున్న మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. చివరకు మీకు ‘గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుని పోతారు’ అంటూ తనకు వ్యతిరేకంగా ఉన్నవారి మరణాన్ని కోరుకున్నారు. అంతటితో ఆగకుండా ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ వ్యాఖ్యానించారు. నంద్యాలలో వేలాది మంది విద్యార్థలు హాజరైన ‘వసతి దీవెన నిధుల విడుదల’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను ఉదహరిస్తూ పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అధికార పక్షానికి సహకరిస్తాయని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లో సైతం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాయని బదులిచ్చారు. ఇక్కడ దౌర్భగ్య ప్రతిపక్షం, దౌర్భగ్య దత్తపుత్రుడు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తూలనాడారు. అయితే సీఎం జగన్ మాటలు గులివింద సామెతను తలపిస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఘటనలు గుర్తు చేసుకుంటే ఆయన ఎలాంటి పాత్ర వహించారో అర్థం చేసుకోవచ్చు. పేరుకే విపక్షం కానీ.. అధికార పక్షం అన్నట్టు వ్యవహరించారు. విశాఖ ఎయిర్ పోర్టులో చేసిన యాగి ఇప్పటికీ గుర్తుంటుంది.
Also Read: KCR: కేటీఆర్ ను సీఎం చేయవద్దనే గవర్నర్ తో కేసీఆర్ పంచాయితీనా?
ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమాలకు అనుమతించని నాటి సీఎం చంద్రబాబు తీరును నిరసిస్తూ ఎయిర్ పోర్టు రన్ వే వద్ద తన అనుంగ శిష్యులు విజయసాయిరెడ్డితో తలపెట్టిన నిర్వాకం అంతాఇంతా కాదు. సీఎంను అవుతాను.. మీ లెక్క తేలుస్తానంటూ పోలీసులు, చివరకు ఎయిర్ పోర్టు సిబ్బందిని సైతం హెచ్చరించారు. కోడి కత్తి, బాబాయి హత్య హైడ్రామా గురించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ తన రాజకీయ లబ్ధికే వాడుకున్నారు. కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఔన్నత్యాన్ని చూపిన పాపాన పోలేదు. అప్పటి టీడీపీ సర్కారు అవునంటే వద్దు.. వద్దంటే అవును అని అడ్డదిడ్డంగా వెళ్లారే తప్ప అధికార పక్షానికి ఏ కోశాన సహకరించిన పాపాన పోలేదు.
నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యాలకు దీటుగా విపక్షాలు కౌంటరు ఇస్తున్నాయి. అటు నెటిజన్లు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మీరేమి పీకారు. ఇంకా అమరావతి,పోలవరం ప్రాజెక్ట్, ఇసుక ధరలు, నాసిరకం మద్యం, విద్యుత్ చార్జీలు, రోడ్లపై గోతులు, చెత్త పన్ను, ఆస్తి పన్ను, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల పరారు, పెట్రో, డీజిల్ ధరలు, వంటి వాటిలో ఏమీ పీకారాని ప్రశ్నిస్తున్నారు. సొంత బాబాయి హత్యకు గురైతే నిందితులను పట్టుకోకుండా ఏమి పీకారంటూ వీర లెవల్ లో ప్రశ్నలు సంధిస్తున్నారు. సహజంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని సీఎం జగన్ ఇవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.

ఆయనకు కనిపించేది సాక్షి టీవీ, వినిపించేది సాక్షి న్యూస్ కాబట్టి ఆయనకు అంతా సవ్యంగా సాగుతున్నట్టు మాత్రమే తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ప్రస్టేషన్ కు సొంత పార్టీలో తప్పుతున్న క్రమశిక్షణే కారణం. తాను రాజీనామా కోరినప్పుడు మంత్రులు రాజీనామా చేయాలి. ప్రశ్నలు వేయకూడదు. అడ్డు తగల కూడదు. అయితే మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా తాను రాజీనామా చేయమని కోరినప్పుడు సీనియర్లు, తన మాట తూచా తప్పకుండా చేసేవారు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ససెమిరా అనడంతో జగన్ ప్రస్టేషన్కు వెళ్లిపోయారు. అందునా విపక్షాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసే వెళ్లేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చాయి. దీంతో కంగారు పడుతున్న ముఖ్యమంత్రి అభద్రతా భావంలోకి వెళి వ్యాఖ్యలు చేస్తున్నారు.