YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). గట్టిగానే హెచ్చరికలు పంపారు. ఎల్లకాలం టిడిపి కూటమి అధికారంలో ఉండదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఘనవిజయం సాధిస్తుందని.. అప్పుడు అందరి లెక్క తేల్చుతామని హెచ్చరించారు. పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి… అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. హైదరాబాదులో అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరు పరిచారు. వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో ఉన్నారు వల్లభనేని వంశీ. ఈరోజు ములాఖత్ లో వల్లభనేని వంశీని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి.
* సంచలన కామెంట్స్
జైలు( jail) నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని అన్యాయం చేసిన వారికి బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు. ముఖ్యంగా పోలీస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొంది ఎక్కడ ఉన్న తిరిగి తీసుకువచ్చి ప్రజల్లో నిలబెడతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చోటా వీళ్ళే కేసులు పెడుతున్నారు.. వీళ్లే బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పులు చేసే కూటమి నేతలు.. తప్పుడు ఆదేశాలు పాటించే అధికారులను విడిచి పెట్టమని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి.
* చంద్రబాబుపై ఆగ్రహం
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై( Chandrababu) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన సామాజిక వర్గం నుంచి వల్లభనేని వంశీ ఎదుగుతున్నందుకు చంద్రబాబులో ఆశ్రోషం అని చెప్పుకొచ్చారు. చంద్రబాబును సీఎం చేసేందుకు వంశి చాలా కష్టపడ్డ విషయాన్ని గుర్తు చేశారు. ఎదురు తిరిగి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం లోకేష్ నైజం అన్నారు. పొద్దున్నే వంశీని అరెస్టు చేశారు. ఓ పథకం ప్రకారం ఇదంతా చేశారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టిడిపికి నచ్చని వాళ్లపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. నెలకు నెలలు జైలులో పెట్టించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
* మునిసిపల్ ఉప ఎన్నికలపై
రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో( Municipal bipole ) విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు. ఒక్క సభ్యుడు లేకపోయినా వైస్ చైర్మన్ పదవి గెలుచుకున్నాం అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తిరుపతిలో కూడా ప్రజాస్వామికంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. వైసిపి బలంగా ఉండి.. దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికలు వాయిదా వేశారని చెప్పుకొచ్చారు. తప్పులు చేస్తున్న టిడిపి నేతలకు.. తప్పులను సమర్థిస్తున్న అధికారులకు మూల్యం తప్పదని హెచ్చరించారు. సప్త సముద్రాలు అవతల ఉన్న తెచ్చి మరి తామేంటో నిరూపిస్తామని హెచ్చరికలు పంపారు.
The Vintage @ysjagan
— || రావాలి జగన్ (@RavaliJagan) February 18, 2025