Bhimavaram 80 Rupees Biryani: బిర్యానీ కోసం ఆశపడి ఇద్దరు యువకులు నాలుగు లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఏపీలోని భీమవరం లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
భీమవరంలో సీతయ్య బిర్యాని హోటల్ ఫేమస్. తక్కువ ధరతో పాటు శుచి,శుభ్రమైన బిర్యాని ఇక్కడ లభిస్తుంది. 80 రూపాయలకే బిర్యానీ లభిస్తునడంతో ఎక్కువ మంది ఇక్కడకు పరుగులు తీస్తుంటారు. భీమవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా తరలివస్తుంటారు. ఉదయం 11 గంటలకే ఈ హోటల్ రద్దీగా మారుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఓ ఇద్దరు యువకులు బిర్యాని తినేందుకు వచ్చారు. స్కూటీ ఆరుబయట పెట్టి హోటల్లోకి వచ్చారు. బిర్యానీ తిని బయటకు వచ్చాక షాక్ కు గురయ్యారు. స్కూటీ డిక్కీ తెరిచి చూడగా.. అందులో నాలుగు లక్షల రూపాయలు మాయమైంది. దీంతో బాధితులు లబోదిబోమన్నారు. పోలీసులను ఆశ్రయించారు.
ఓ వ్యాపారి వద్ద ఈ ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా బ్యాంకులో నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు బయలుదేరారు. కానీ బ్యాంకులో పని జరగలేదు. కొద్దిసేపు అయ్యాక రమ్మని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో వెనుతిరి గారు. ఆకలిగా ఉండడంతో సీతయ్య హోటల్ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే వారిని ఆగంతకులు అనుసరించారు. వారు హోటల్లోకి వెళ్లిన వెంటనే డిక్కీ లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను తీసుకొని ఉడాయించారు. అక్కడున్న సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
►భీమవరంలో 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు
►భీమవరం పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగ ఎత్తుకు పోయాడు. pic.twitter.com/PNm8ae3HLb— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 26, 2023