Viral Video (3)
Viral Video: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ లగ్జరీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. బహుశా అది స్లీపర్ క్లాస్ అయి ఉండవచ్చు. అందులో ఎక్కువ శాతం యువతులు ఉన్నారు. వారి వయసు కూడా పాతిక సంవత్సరాల కంటే తక్కువగానే ఉంది. వారంతా ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. భారీగానే సంపాదిస్తున్నారు కాకపోతే వారి వ్యవహార శైలి పూర్తి ఆధునికతను కలిగి ఉంది. చాలాకాలం తర్వాత కలిశారనుకుంటా తెగ సందడి చేయడం మొదలుపెట్టారు. స్లీపర్ కోచ్ కావడంతో రాత్రి మొత్తం పడుకున్నారు.. తెల్లారి డాన్సులు, పాటలతో హోరెత్తించడం మొదలుపెట్టారు. అలా వారు చేసిన పని సోషల్ మీడియాలో సంచలనానికి కారణమైంది వారి జీవితాలను కూడా తారుమారు చేసింది.
Also Read: కొత్త జంట చైతు-శోభిత సాహసాలు… రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లిన స్టార్ కపుల్!
ఆ వీడియోలో దృశ్యాల ప్రకారం…
సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఆ బస్సు తమిళనాడు రాష్ట్రానికి చెందింది. పైగా ఆ బస్సులో “హౌరా మెయిలా” అనే పాట వినిపిస్తోంది.. ఆ పాటకు ఆ యువతులు అందంగా డాన్స్ చేశారు. పైగా డ్రైవర్ పక్కన కూర్చొని వారు హంగామా చేశారు. ఆ డ్రైవర్ కూడా ఆ యువతులను చూస్తూ ఉండడంతో రూట్ తప్పాడు. డ్రైవింగ్ మీద పట్టు కోల్పోయాడు. అంతే ఆ బస్సు రెయ్యిన దూసుకుపోయింది. రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో అప్పటిదాకా డాన్స్ చేసిన ఆ యువతులు గాయాల బారిన పడ్డారు.
వాళ్లు రాకుండా ఉండి ఉంటే..
ఆ యువతులు పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని.. రెచ్చగొట్టే విధంగా డాన్సులు వేయడంతో డ్రైవర్ కూడా లయ తప్పాడు. ఒక్కో యువతి ఒక్కో తీరుగా హావా భావాలను ప్రదర్శించడంతో అతడు మై మరిచిపోయాడు. ఆ యువతులు అలాగే డ్యాన్స్ చేస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయాడు. అలానే వారిని చూస్తూ ఉండిపోయాడు. ఈ లోగానే బస్సు అదుపుతప్పింది. పక్కలో ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ఆ యువతులు మాత్రమే కాకుండా , బస్సులో ఉన్నవారు మొత్తం గాయపడ్డారు. దీంతో అప్పటిదాకా సందడిగా సాగిన వారి ప్రయాణం విషాదంగా మారింది.. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..” పక్కనే పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని డ్యాన్సులు వేస్తుంటే.. వాడు మాత్రమే ఏం చేస్తాడు.. డ్రైవింగ్ మీద పట్టు కోల్పోయాడు. కాలువలోకి దూసుకుపోయాడు. ఇప్పుడు ఏం అనుకొని ఏం లాభం. కొన్ని కొన్ని దారుణాలు ఇలానే జరుగుతుంటాయి.. అలాంటివి జరిగినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.