Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతున్నారు.

సోషల్ మీడియా కారణంగా ఎవరైనా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోతున్నారు. ఇటీవల కచ్చా బాదమ్ పాటతో భుజన్ బద్యాకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కూలీ పని చేసుకునే 60 ఏళ్ల వ్యక్తి మమ్మిక్కా కూడా మోడల్ అయిపోయాడు.

తాజాగా కేరళలో రోడ్డుపై బెలూన్స్ అమ్మే యువతి కూడా ఓవర్‌నైట్‌లోనే బిగ్ స్టార్‌గా మారిపోయింది. రాజస్థానీ కుటుంబానికి చెందిన కిస్బు అనే మహిళ రోడ్డుపై బెలూన్‌లు అమ్ముకుంటూ ఉండగా ఓ ఫోటో గ్రాఫర్ కన్ను ఆమెపై పడింది. దీంతో ఆమెను ఓ ఫోటో తీశాడు. అతడు తాను తీసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
Also Read: కేసీఆర్ దెబ్బకు పాల డిపోలన్నీ ఖాళీ.. హోరెత్తుతున్న వాట్సాప్, ఫేస్ బుక్?
కొందరు ఫోటోలు తీసేవారు కిస్బు కుటుంబాన్ని సంప్రదించి మేకోవర్ ఫోటో షూట్ కోసం ఒప్పించి ఆమెను అందంగా ముస్తాబు చేసి అనేక రకాల స్టిల్స్‌లో ఫోటోలు తీశారు. కిస్బుకు సంబంధించి రోడ్డుపై బెలూన్స్ అమ్ముకునే ఫోటోలను, ఆఫ్టర్ మేకోవర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

కిస్బు కళ్లలో మ్యాజిక్ ఉందని అందుకే ఆమె ఫోటోలు నెటిజన్‌లను ఆకర్షించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో పాకిస్థాన్‌లో టీ విక్రయించే అర్షద్ ఖాన్ అనే వ్యక్తి కూడా సోషల్ మీడియా వల్లే ఫేమస్ అయిపోయాడు. మీరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయాలనుకుంటే మంచి ఫోటోలను తీసి అప్‌లోడ్ చేసి చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు?.
Also Read: బామ్మర్ధిని గెలిపించడానికి బరిలోకి బావ..