Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు చీటింగ్ కేసులో UPలోని మొరదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని.. వచ్చే నెల 25న హాజరు కావాలని ఆదేశించిందని వార్తలు వచ్చాయి. ఆమె ఢిల్లీలో ఓ ఈవెంట్ కోసం రూ.37 లక్షలు తీసుకుని.. ఈవెంట్‌కు హాజరు కాకపోవడంతో 2019లో ఆమెపై చీటింగ్ కేసు నమోదైందని ఆ వార్తల సారాంశం.

దాంతోనే సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తపై సోనాక్షి స్పందించింది. “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలు, జర్నలిస్టులు, వార్తా విలేకరులను నేను అభ్యర్థిస్తున్నాను” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Also Read: కుర్ర హీరోయిన్ లా మారితే ఆంటీ పాత్రలు రావమ్మా
ఇక పెళ్లి చేసుకుంటే కరోనా వస్తుందని ఆ మధ్య సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అభిమానులతో సరదాగా గడిపేందుకు సెలబ్రిటీలు ఆస్క్ మీ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంటారు. ఈక్రమంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.

అయితే, ఈ ముచ్చట్లలో భాగంగా ఓ అభిమాని, బాలీవుడ్‌లో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు మీరెప్పుడు చేసుకుంటారు, మీరు పెళ్లి చేసుకుని పిల్లలని కంటే చూడాలని ఉంది. అంటూ కామెంట్స్ చేశాడు. అతని కామెంట్స్ కి సోనాక్షి సిన్హా పై విధంగా ఫన్నీగా రిప్లై ఇచ్చింది.
[…] […]