https://oktelugu.com/

Yoga On Scooty: స్కూటీపై హాట్ యోగా.. ఏమన్నా తిప్పిందా ఈ అమ్మాయి.. వైరల్‌ వీడియో

Yoga On Scooty: ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ చేతిలోకి వచ్చాక.. ఇంటర్నెట్‌ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. సోషల్‌ మీడియా ప్రభావం పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావాలనే కోరిక చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది నలుగురికి ఉపయోగపడే సమాచారం షేర్‌ చేస్తుండగా ఇంకొందరు.. నానా పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నేల మీద కాలు నిలపలేకుండా ఎన్నో ఫీట్లు చేస్తూ నానారకారలుగా కష్టపడుతున్నారు. ఓ యువతి నేలపై చేయవలసిన యోగాను తన స్కూటీ మీద చేసింది. […]

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 25, 2023 / 04:41 PM IST
    Follow us on

    Yoga On Scooty: ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ చేతిలోకి వచ్చాక.. ఇంటర్నెట్‌ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. సోషల్‌ మీడియా ప్రభావం పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావాలనే కోరిక చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది నలుగురికి ఉపయోగపడే సమాచారం షేర్‌ చేస్తుండగా ఇంకొందరు.. నానా పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నేల మీద కాలు నిలపలేకుండా ఎన్నో ఫీట్లు చేస్తూ నానారకారలుగా కష్టపడుతున్నారు. ఓ యువతి నేలపై చేయవలసిన యోగాను తన స్కూటీ మీద చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి నెట్టింట పోస్ట్‌ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు చూసి చూడనట్లుగా వదిలేయగా.. మరి కొందరు రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు.

    వివిధ భంగిమల్లో..
    సాధారణంగా యోగా అంటేనే నేలపై చేసేంది. కానీ అందరిలా చేస్తే సోషల్‌ మీడియాలో తనకు గుర్తింపు ఏముంటుంది అనుకున్న సదరు యువతి కొత్తగా ఆలోచించింది. క్రియేటివిటీ చేసింది. ఈ క్రమంలో తన స్కూటీపై పలు భంగిమల్లో ఆసనాలు వేయాలని నిర్ణయించుయుంది. ఇందుకు ముందుగా ప్లాన్‌ చేసుకుని ఓ ప్రదేశం ఎంచుకుని అక్కడి వెళ్లి.. స్కైటీపై వేయడానికి ఈజీగా ఉండే యోగా ఆసనాలన్నీ వేసింది. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. అన్నీ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

    నెటిజన్ల కామెంట్స్‌..
    ఆమె చేసిన యోగా ఫీట్‌ దృశ్యాల వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్‌ ‘ఇదేలాంటి యోగా బ్రో.. ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి’ అంటూ కామెంట్‌ చేశారు. మరొకరు కూడా స్పందిస్తూ ‘అసలు దీనిని యెగా అంటారా..? ఎక్కడా చెప్పకండి. వింటే నవ్వుతారు’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. యోగా ఇలా కూడా చేయవచ్చా అని మరొకరు కామెంట్‌ పెట్టాడు. ఇలా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 47 వేల లైకులు, 5 లక్షల 37 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా పలువురు నెటిజన్లు ఈ వీడియోను తమ సన్నిహితులకు షేర్‌ కూడా చేస్తున్నారు.

    మొత్తానికి సదరు యువతి ఏదైతే ఆశించిందో అది నెరవేరినట్లు కనిపిస్తోంది. తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని సదరు యువతి కూడా పోస్టు పెడుతుందేమో మరి!