Viral Video Madhuranagari Song: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలంటే ఎలా తీస్తారో అందరికి తెలిసిందే. ఆయనతో చేసిన హీరోలందరు స్టార్లుగా మారారు. అంటే ఆయన తీసే సినిమా విజయానికి వంద శాతం న్యాయం చేస్తారు. అందుకే ఆయన చేతిలో నుంచి వచ్చిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. ఈ కోవలో వచ్చిన సినిమా పెళ్లిసందడి ఎంత సందడి చేసిందో మనకు సుపరిచతమే. శ్రీకాంత్ ను లవర్ బాయ్ గా చూపించడంలో రాఘవేంద్ర రావు పైచేయి సాధించారు. దానికి సీక్వెల్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన అదే సినిమా కరోనా ప్రభావంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించకపోయినా మంచి మార్కులే వేసుకుంది. దీంతో రోషన్ కు హీరోయిన్ శ్రీలీలకు కూడా ప్లస్ అయింది.

ఈ సినిమాలో మధురానగరిలో పాట ఎంతో పేరు తెచ్చుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి అద్భుత బాణీలు అందించడంతో పాటు ఆయన స్వర కల్పనతో పాటకు ప్రాణం పోశారు దీంతో సినిమాలో ఈ పాటకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ పాటకు ఎంతో విశిష్టత ఏర్పడింది. ఈ పాటకు చాలా మంది ఫిదా అయ్యారు. తమ స్టెప్పులు వేస్తూ సందడి చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సినిమాలోని పాటలన్ని హిట్ అయ్యాయి.
Also Read: Sarkaru Vaari Paata Collections: 111.59 కోట్లు.. ఇది ఒక్క మహేష్ కే సాధ్యం
మధురానగరి పాటలో శ్రీలీల ఎలా డాన్స్ చేసిందో ఓ యువతి సేమ్ అలాగే డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. లక్షల్లో షేర్ లు, వేలల్లో లైకులు వస్తున్నాయి. దీంతో ఈ పాట ఇలాగా కూడా తన ప్రభావం చూపుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలో పాటలకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే పాటల ఎంపిక నుంచి దాని పర్ఫామెన్స్ వరకు అన్ని తానే చూసుకుంటారు. అందుకే ఆయన సినిమాల్లో పాటలకు అంత క్రేజ్ ఉంటుంది. ఆయన చేసే ప్రతి సినిమాలోని పాటలు ప్రేక్షకులను మెప్పించిన విషయం విధితమే.
Also Read: Director Sukumar: హద్దులు దాటిపోయిన డైరెక్టర్ సుకుమార్ రెమ్యూమరేషన్
మధురానగరిలో పాటకు శ్రీలీల చేసిన నృత్యానికి ఫిదా అయిపోయినట్లే ప్రేక్షకులు మగ్దులవుతున్నారు. కానీ ఆ యువతి వేసుకున్న దుస్తులపై నెటిజన్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బట్టలు వేసుకుంటే మీ ఇంట్లో తిట్టరా అని కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. లైకులతో పాటు తిట్లు కూడా బాగానే రావడం సంచలనం కలిగిస్తోంది. మనం మన వీడియోలు పోస్టు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది. పొట్టి పొట్టి దుస్తులు ఇష్టమొచ్చినట్లు గా డాన్స్ చేస్తే నెటిజన్లు మాత్రం తమ తిట్ల దండకంతో సమాధానాలు చెప్పడం కూడా ఓ విశేషమే.



[…] Also Read: Viral Video Madhuranagari Song: శ్రీలీలలా దుమ్మురేపిన యు… […]