
PM Modi Meets Actors: రాజకీయ వ్యూహంలో, చతురతలో ప్రధాని నరేంద్ర మోదీ తీరే వేరు. మిగతా నేతల్లో విమర్శలు, ఎదురు దాడులు ఉండవు. నోరు మెదపకుండానే ప్రత్యర్థితని చిత్తు చేయడంలో మోదీ దిట్ట. తాజాగా ఆయన ఇచ్చిన ఓ విందు.. ప్రతిపక్షాలు నోరు మెదుపకుండా చేసింది. ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవానికి ఆదివారం రాత్రి బెంగళూరు వెళ్లిన మోదీ అక్కడి రాజ్‌భవన్‌లో బస చేశారు. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోను సోమవారం ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో పలు దేశాలకు చెందిన విమానాల విన్యాసాలు ప్రదర్శిస్తాయి.
Also Read: AP New Governor: ఏపీ గవర్నర్ మార్పు.. అంతబట్టని బీజేపీ రాజకీయం..ఎవరికి చేటు?
ప్రముఖులకు విందు..
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేందకు మోదీ తన రాజకీయ వ్యూహానికి తెరతీశారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు విందో భోజనం ఏర్పాటు చేశారు. కేజీఎఫ్ హీరోతో ఆ సినిమా టీమ్, కాంతార హీరో, రిటైర్డ్ క్రికెటర్ అనిల్ కుంబ్లే, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సతీమణి, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులతోపాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. అయితే మోదీతో కలిసి కేజీఎఫ్, కాంతార హీరోలు, పునీత్ రాజ్‌కుమార్ భార్య డిన్నర్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని లెక్కలు వేరే ఉంటాయని ఇప్పటికే రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ప్రముఖులతో పలు అంశాలపై చర్చ..
కర్ణాటక రాజ్‌భవన్‌లో ప్రముఖులకు డిన్నర్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ సినిమా, క్రీడలు, పరిశ్రమలతోపాటు అనేక రంగాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తులను విందుకు ఆహ్వానించారు. వారితో కలిసి మోదీ భోజనం చేశారు. ఈ సందర్భంగా డిన్నర్‌కు హాజరైన ఆయా రంగాల ప్రముఖులు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కన్నడ సినిమా రంగానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అనేక ఆలోచనలు చేశారని తెలిసింది. అదే సమయంలో వారి నియోజకవర్గాల్లోని సమస్యలు, వాటి పరిష్కారాల గురించి సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారని సమాచారం. కన్నడ సినిమా అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీతో ఇదే సమయంలో చర్చ జరిగినట్లు సమాచారం. క్రికెట్, ఇతర క్రీడలపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు చర్చించారని తెలిసింది.

కేజీఎఫ్, కాంతార సినిమాల ముచ్చట..
కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతోపాటు, కాంతార సినిమాలు ఎంత సూపర్ డూప్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్, కాంతార సినిమాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారని తెలిసింది. గత శనివారం మంగళూరు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కాంతార సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడి వెళ్లారు. భారతదేశ అసలైన సంస్కృతిని చాటిచెప్పే చిత్రం కాంతార అని అమిత్‌షా ప్రశంసించారు. కాంతార రిషబ్ శెట్టి నటనను మెచ్చుకున్నారు. తాజాగా మోదీ కూడా వారిని ప్రత్యేకంగా అభినందించినట్లు తెలస్తోంది. ఇదిలా ఉంటే రాజ్‌భవన్‌లో జరిగిన డిన్నర్ పార్టీకి క్రికెటర్లు అనిల్ కుంబ్లే దంతపతులు, జావగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ హాజరయ్యారని కన్నడ మీడియా తెలిసింది. శాండల్ వుడ్ రంగానికి చెందిన దివంగత డాక్టర్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ రాజ్ భవన్‌లో జరిగిన డిన్నర్ పార్టీకి వెళ్లారు. కేజీఎఫ్ హీరో రాకింగ్ స్టార్ యష్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాత విజయ్ కిర్గందూర్, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. వీరితో పాటు కాంతారా సినిమా హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా విందుకు హాజరై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారని సమాచారం. కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వింధుకు హాజరైనారని తెలిసింది.
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటకలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రాజ్‌కుమార్ భార్యతోపాటు పలు రంగాలకు చెందిన వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ లెక్కలకు చాలా అర్థలు ఉంటాయని, అందుకే దేశంలో బలమైన నాయకుడు అయ్యారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read:KCR- Etela Rajender: కేసీఆర్ రాజనీతి.. ఈటల విలవిల!!