UK man Sperm Donor: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఇప్పటికే 129మందికి తండ్రయ్యాడు. అంతమంది వారసులను పుట్టించేలా చేశాడు. ఇంకా తన బుద్ది తీరలేదని.. టార్గెట్ 150 అంటున్నాడు. ఇదంతా చేస్తుంది యంగ్ మ్యాన్ అనుకుంటే పొరపాటే.. కాటికి కాలు చాపిన 60 ఏళ్లు దాటిన ఓ రిటైర్డ్ టీచర్. అవును 58 ఏళ్లకు మొదలుపెట్టిన ఇతడి కౌంట్ ఇప్పటికీ 129 మంది పిల్లలు పుట్టించాడట.. 150 నింపుతానంటున్నాడు.
బ్రిటన్ దేశానికి క్లైవ్ జోన్స్ వయసు ఇప్పుడు 66 ఏళ్లు. తనకు 58 సంవత్సరాలు నిండినప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఇప్పటికీ వీర్యదానం చేయడం ద్వారా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో 9మంది గర్భం దాల్చారని.. త్వరలో పుట్టబోతున్నారని తెలిపారు.
తాను వీర్యదానం చేయడానికి డబ్బులు తీసుకోవడం లేదని.. ఉచితంగా ఇస్తున్నట్టు జోన్స్ తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే తానే ఎక్కువమందికి వీర్యదానం చేసిన వ్యక్తిగా ఉన్నట్లు తెలిపాడు. మరికొన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని.. 150 మందికి తండ్రి అయిన తర్వాత ఆపేస్తానని జోన్స్ తెలిపాడు.
బ్రిటన్ లో వీర్యదానం చేయడానికి వయసు 45 ఏళ్లలోపు వారే చేయాలి. జోన్స్ వయసు 66 ఏళ్లు కావడంతో అతడికి అనుమతి లేదు. అయితే ఫేస్ బుక్ ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయ్యి ఉచితంగా వీర్యదానం చేస్తున్నాడు. బ్రిటన్ లోని చాలా క్లినిక్ లకు వీర్యాన్ని ఇచ్చేస్తున్నాడు. ఇలా ఇప్పటికీ ఇతడి ద్వారా 129మంది పిల్లలు పుట్టారట.. 150 మందిని పుట్టించడమే ధ్యేయం అంటూ ముందుకెళుతున్నాడు.
పిల్లలు లేని దంపతుల కోరిక తీర్చడమే తన ధ్యేయమని జోన్స్ అంటున్నారు. అయితే యూకే అథారిటీ మాత్రం ఇలా వయసు అయిపోయాక వీర్యదానం చేయడం కరెక్ట్ కాదని.. ఏమైనా సమస్యలు వస్తే బాధ్యుడిని చేస్తామని హెచ్చరించింది.