Rapido Bike: నగరాలు అంతకంతకు విస్తరిస్తున్నాయి. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. విద్యావంతులు పొట్ట చేత పట్టుకుని ఆ నగరాలకు వలస వెళ్తున్నారు. తమకు నచ్చిన పని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగాలు కూడా 24 గంటల పాటు సాగుతున్నాయి. ఉదయం చేసే కొలువులు, రాత్రి నిద్రలు మాని చేసే కొలువులు… ఇలా ఎన్నో రకాలు. ఎవరు ఎలాంటి చదువు చదివితే అలాంటి కొలువులు చేస్తున్నారు. గతంలో స్త్రీలు నైట్ షిఫ్టులు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గిరి గిసుకొని అలానే ఉంటాయి ఉద్యోగాలు దొరకని పరిస్థితి. అందుకే మహిళలు కూడా రాత్రిపూట పనిచేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇంటికి వెళ్లడం ఆలస్యమైనప్పుడు ఏ క్యాబో, బైకో బుక్ చేసుకుని వెళ్తున్నారు. అయితే ఈ సర్వీసులు నిర్వహిస్తున్న కంపెనీలు తాము భద్రత చర్యలు పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. అది ఉత్త డొల్లే అని తేలిపోయింది. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
బెంగళూరు నగరంలో ఐటీ పరిశ్రమ విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. దేశంలోనే అత్యున్నత ఐటి కంపెనీలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక విదేశీ కంపెనీలకైతే లెక్కేలేదు. లక్షల్లో జీతం, 24 గంటల పాటు కొలువులు.. అసలు బెంగళూరు వెళ్తే మనం ఉన్నది ఇండియాలోనా లేక సిలికాన్ వ్యాలీ లోనా అనిపిస్తుంది. అలాంటి బెంగళూరులో ఆడ, మగ తారతమ్యం లేకుండా ఐటీ కంపెనీల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కోవిడ్ ముందు వరకు చాలావరకు కంపెనీలు రవాణా సౌకర్యం కల్పించేవి. కోవిడ్ తర్వాత ఆర్థిక మాంద్యం పెరిగి కొన్ని కంపెనీలు ఆ సర్వీసును ఎత్తేసాయి. అలాంటి ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న యువతికి చేదు అనుభవం ఎదురయింది. దీంతో ఆమె ప్రాణాలకు తెగించి తన శీలాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది.
ఈనెల 21న బెంగళూరు నగరంలో యలహంక ప్రాంతంలో ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఓ యువతి(30) తన ఇంటికి వెళ్లేందుకు రాపిడో బైక్ బుక్ చేసింది. దాని రైడర్ పేరు దీపక్ రావు.. బుక్ చేసిన వెంటనే రైడర్ రావడంతోఆమె అతడి బైక్ ఎక్కింది. అప్పటికి టైం రాత్రి 11:00 అవుతున్నది. పైగా ఓటీపీ చూస్తానని ఆ యువతి ఫోన్ దీపక్ రావు తీసుకున్నాడు. సాధారణంగా కస్టమర్ అంటే దేవుడితో సమానం. యువతి రూపంలో ఉన్న ఆ కస్టమర్ ను అతడు తప్పుగా చూశాడు.
పైగా మద్యం మత్తులో ఉన్న అతడు బండిని రాంగ్ రూట్లో తీసుకెళ్లడం ప్రారంభించాడు. అంతేకాదుబైక్ మీద ఉండగానే తప్పుడు చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో ఆ ప్రమాదం ముందుగానే ఊహించిన ఆ యువతి.. అతడి బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో అలారం మోగించింది. మౌనంగా ఉన్న అతడు బండి వేగం తగ్గించాడు..ఇదే అదునుగా బండి మీద నుంచి అమాంతం కిందికి దూకేసింది. ఆ యువతి తెగువకు భయపడిపోయిన ఆ రైడర్ వెంటనే వెనక్కి తిరగకుండా వెళ్లిపోయాడు. తర్వాత ఆ యువతి రోడ్ క్రాస్ చేసి లిఫ్ట్ కోసం చెయ్యి ఊపింది. బెంగళూరు నగరంలోని సిసి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మద్యమాల్లో వైరల్ గా మారాయి. అన్నట్టు ఆ కంపెనీ రైడర్ ను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆ రైడర్ ను రాపిడో సంస్థ ఉద్యోగం నుంచి తీసివేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన బెంగళూరు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
#Bengaluru: a 30yr old female architect in Bengaluru jumped off from bike to save herself from the drunk rider of #Rapido.
Deepak Rao(28) a bike rider took her phone on pretext of checking OTP and started moving in wrong direction.
He also grobed her.. pic.twitter.com/CufnTC8VbZ
— Saba Khan (@ItsKhan_Saba) April 26, 2023