Woman Heart Stopped: సృష్టిలో అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ మనం వాటిని నమ్మలేకుండా ఉంటాయి. మనిషి బతకాలంటే గుండె నిరంతరం కొట్టుకుంటూనే ఉండాలి. గుండె పనిచేయడం ఆగిందంటే మనిషి చనిపోయినట్లే భావిస్తారు. గుండెకు మన ప్రాణానికి దగ్గర సంబంధం ఉంటుంది. మన శ్వాసలు గుండె ద్వారానే జరుగుతాయి. ఊపిరి పోయిందంటే ప్రాణం పోయినట్లే. అతడు చనిపోయినట్లే. మన దేహంలో ముఖ్యమైన భాగం కూడా గుండె. అందుకు గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. దానిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

మనిషి ప్రధాన అవయవం గుండె కావడంతో దాని పనితీరు ఆధారంగానే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. దీనికి కారణాలు కూడా మనకు తెలిసినా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే గుండెజబ్బులు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా నూరేళ్లు బతకాల్సిన అవయవాలు యాభై ఏళ్లకే మూలన పడుతున్నాయి. దీనికి మన ఆహారపు అలవాట్లే కారణం అని తెలిసినా ఏం చేయలేకపోతున్నాం. వద్దని చెబుతున్న వాటిని తింటూ మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం.
సాధారణంగా మనిషి గుండె మూడు నిమిషాలు కొట్టుకోకపోతే చనిపోయినట్లు చెబుతారు. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ గుండె ఏకంగా 210 నిమిషాల పాటు పనిచేయలేదు. కానీ ఆమె మాత్రం బతికింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. మీరట్ లోని లాలాలజపతి రాయ్ ఆస్పత్రిలో ఓ మహిళకు గుండె ఆపరేషన్ చేస్తుండగా 210 నిమిషాలు గుండె కొట్టుకోకుండా ఆగిపోయింది. దీంతో అందరు ఆమె చనిపోయిందని అనుకున్నారు. కానీ ఆమె ఆయుష్షు గట్టిది కావడంతో ఆమె తిరిగి బతకడం సంచలనం కలిగిస్తోంది.

ఆమెకు హైటెక్ మెషీన్లతో కృత్రిమంగా కొట్టుకునేలా చేశారు. అనంతరం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేయడం గమనార్హం. మనిషి గుండె అంత సేపు పనిచేయకున్నా ఆమె బతకడం ఓ విచిత్రంగా అనిపించింది. వైద్యులే నిర్ఘాంతపోయారు. ఇది ఎలా జరిగిందని ఆలోచనలో పడిపోయారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే గుండె ఆగిపోవడంతో ఇక అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆమె గుండె తిరిగి కొట్టుకోవడం నిజంగా సంచలనమే.