Woman Biker: మోడీతో ఫోన్ చేయిస్తా.. మద్యం తాగి బైక్ నడుపుతూ ఈ యువతి చేసిన వీరంగం వీడియో వైరల్

పోలీసుల ఎదుట కొందరు మందుబాబుల తీరు.. చూసేందుకు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. ఇటీవల పలువురు యువతులు కూడా.. మేమేం తక్కువ కాదంటూ ఓవర్ యాక్షన్ చేయడం కూడా చూస్తున్నాం.

Written By: Suresh, Updated On : September 28, 2023 8:12 pm

Woman Biker

Follow us on

Woman Biker: మందు తాగడం కొందరికి ఫ్యాషన్ అన్నచందంగా మారింది. తాగి డ్రైవింగ్ చేయవద్దు అని ఎన్ని సార్లు చెప్పినా..అసలు పట్టించుకొని వారు ఎందరో ఉన్నారు. ఇక కొన్ని సార్లు పోలీసుల బిహేవియర్, మరోసారి పబ్లిక్ ప్రవర్థన కోపం తెప్పిస్తే మరికొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. తాగి బండి నడుపుతుంటే తిరిగి ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రి ఇంట్లో ఎదురుచూస్తారు అని కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు. అంతేకాదు స్పీడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ తో ఇతరులను కూడా ఇబ్బంది పెడుతారు. ఈ విన్యాసాలు మొత్తం తాగినప్పుడు మరింత ఎక్కువ అవుతాయి. అయితే ట్రాఫిక్ పోలీసులతో గొడవలు పెట్టుకోవడం మాత్రమే కాదు, పెద్ద వాళ్లతో ఫోన్ చేయించి నీ ఉద్యోగం తీయిస్తాను అనే డైలాగులు సినిమా మాదిరి లైవ్ లో కూడా వినిపిస్తుంటాయి. అలాంటి ఓ సంఘటనే ఇక్కడ జరిగింది అదేంటో చూసేయండి..

పోలీసుల ఎదుట కొందరు మందుబాబుల తీరు.. చూసేందుకు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. ఇటీవల పలువురు యువతులు కూడా.. మేమేం తక్కువ కాదంటూ ఓవర్ యాక్షన్ చేయడం కూడా చూస్తున్నాం. తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బైకుపై వెళ్తున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు నిలిపేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడించనా.. అంటూ రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్ ప్రాంతానికి చెందిన నుపుర్ ముఖేష్ పటేల్ అనే యువతి బుల్లెట్ బైక్‌పై దక్షిణ ముంబై వైపు ప్రయాణిస్తున్నట్లు బాంద్రా-వర్లీ సీ లింక్ సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన వారు కాపు కాసి ఆమె రాగానే బండిని ఆపేశారు. పోలీసుల వాహనాన్ని ఆపగానే.. యువతి చిర్రెత్తుకొచ్చింది. నా బండినే ఆపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా బండిని తాకితే నరికేస్తా.. అంటూ తిట్లదండకం అందుకుంది. అంతటితో ఆగకుండా ‘‘మోదీకి ఫోన్ చేసి మాట్లాడించమంటావా’’.. అని అనడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.

బైక్ దిగేందుకు ఒప్పుకోని ఆమె.. ‘‘నరేంద్ర మోదీ ఫోన్ చేసి బైక్ ఆపమని చెబితే చేస్తా.. వెళ్లి మోదీకి ఫోన్ చేయండి’’ అని అనేసరికి పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికీ శాంతించని యువతి.. ‘‘ఈ రోడ్డు మా నాన్నది.. మేము ట్యాక్స్ కడుతున్నాం.. నన్ను ఎవరూ ఆపలేరు’’.. అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. ఈ క్రమంలో అడ్డు వస్తున్న కానిస్టేబుల్‌ను పక్కకు నెట్టేసింది. పనికి ఆటంకం కలిగించడం, ర్యాష్ డ్రైవింగ్, ప్రాణహాని కలిగించడం, ప్రభుత్వోద్యోగిపై దాడి చేసినందుకు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బహుశా.. ఈమె బ్రెయిన్ దొబ్బిందేమో’’.. అంటూ కొందరు, ‘‘మందుబాబులను మించిన యాక్టింగ్’’.. అంటూ మరికొందరు, ‘‘ఈమె చాలా ఫన్నీగా ఉందే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.