
Renu Desai- Pawan Kalyan: ఎన్నికలు సమయం వస్తుందంటే చాలు ఎవరి వ్యూహాలకు తగ్గట్టుగా వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వెయ్యడం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఎదురుకోవడానికి కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారం పై మాత్రమే టార్గెట్ చెయ్యాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి.
ఇందుకోసం పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ ని వైసీపీ మీడియా పావులాగా వాడుకుంటుంది. గతం లో కూడా ఈమె సరిగ్గా ఎన్నికల సమయం లో పవన్ కళ్యాణ్ ని తల్చుకుంటూ,అతని పై ఒక ఇంటర్వ్యూ లో సంచలన ఆరోపణలు చేసింది. సాక్షి టీవీ జర్నలిస్ట్ ప్రేమ ఇంటర్వ్యూ లో ఆమె ఇలాంటి కామెంట్స్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆమె పవన్ కళ్యాణ్ ని మరియు ఆయన అభిమానుల్ని కావాలనే టార్గెట్ చేస్తుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

గడిచిన కొద్దిరోజుల నుండి ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంది. ఇటీవలే అకిరా నందన్ పుట్టినరోజు జరిగింది,అకిరా పుట్టినరోజు అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతారు.వాళ్ళు శుభాకాంక్షలు తెలపడం, ఒక్కసారి మా అన్న కొడుకుని చూపించండి ప్లీజ్ అని అడగడం లో కూడా ఈమెకి తప్పులు కనిపించాయి. ఈమధ్యనే ఆమె ‘అన్న కొడుకు ఏంటి..?, అతను నా కొడుకు, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి, నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి రావొద్దు’ అంటూ చాలా ఫైర్ అయ్యింది.ఇందులో ఆమె ఇంత ఫైర్ అవ్వడానికి ఏముంది అని ఇతర హీరోల అభిమానులు సైతం ఆశర్యపోయారు.
ఈమధ్య ఆమె ప్రతీ రోజు పవన్ కళ్యాణ్ ని ఆయన ఫ్యాన్స్ ని ఎదో విధంగా టార్గెట్ చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటె మళ్ళీ ఆమె మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసినా చేస్తుందని, ఎన్నికలు కూడా దగ్గరకి వస్తున్నాయి కాబట్టి ఆమె నుండి ఇలాంటివి ఆశించొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.