Homeఎంటర్టైన్మెంట్Rishab Shetty- Kantara: 'కాంతారా' కి ఆస్కార్ అవార్డ్స్ వెల్లువ

Rishab Shetty- Kantara: ‘కాంతారా’ కి ఆస్కార్ అవార్డ్స్ వెల్లువ

Rishab Shetty- Kantara: కంటెంట్ బాగుంటే హీరో ఊరు పేరు తెలియకపోయిన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొనిమరీ ఆరాధిస్తారు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచినా చిత్రం ‘కాంతారా’..కన్నడ లో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఇప్పటికి కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ బోర్డ్స్ పడుతూనే ఉన్నాయి అంటే అది మాములు విషయం కాదనే చెప్పాలి..కన్నడ లో అద్భుతమైన విజయం సాదించేలోపు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకి మంచి డిమాండ్ ఏర్పడింది..కన్నడలో విడుదలైన 15 రోజుల తర్వాత తెలుగు, హిందీ మరియు తమిళం బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు..అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం.

Rishab Shetty- Kantara
Rishab Shetty- Kantara

తెలుగు లో ఇప్పటి వరుకు 24 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం హిందీ లో 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది..అలా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం..ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమ గర్వపడే విధంగా మరో రేర్ ఫీట్ ని అందుకోబోతుంది.

అదేమిటి అంటే ఈ సినిమాని ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపిస్తే కచ్చితంగా ఎదో ఒక క్యాటగిరి లో అవార్డుని సొంతం చేసుకుంటుంది అని..ఆ సత్తా ఈ సినిమాకి ఉందని కొంతమంది క్రిటిక్స్ తో పాటు ఈ సినిమాని వీక్షించిన ప్రేక్షకులు కూడా మూవీ టీం పై ఒత్తిడి తెస్తున్నారట.రోజుకి 25 వేలకి పైగా ఆడియన్స్ ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపండి అంటూ మమల్ని ట్యాగ్ చేస్తున్నారని ఆ చిత్ర దర్శకుడు మరియు హీరో రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు..ఈ సినిమా ఇంత పెద్ద సంచలన విజయం సాదిస్తుందని కలలో కూడా ఊహించలేదని.

Rishab Shetty- Kantara
Rishab Shetty- Kantara

 

ఇక ఆస్కార్ అవార్డ్స్ కోసం అయితే ఈ సినిమా ని తియ్యలేదని..మనస్ఫూర్తిగా నా ఊరి కథని వెండితెర మీద చూపించాలనుకున్నానని రిషబ్ శెట్టి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు..కానీ అందరూ ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపమని అడుగుతున్నారు కాబట్టి..మీ మాటకి గౌరవం ఇచ్చి కచ్చితంగా ఒస్కార్స్ కి ఈ సినిమాని పంపుతాను అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version