China Battery: ప్రస్తుత రోజుల్లో ఫోన్ నిత్యావసర వస్తువు అయింది. ఆన్‌డ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండే పరిస్థితులు రాబోతున్నాయి. మరోవైపు అన్ని ఫోన్లు ఏటా అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఫోన్లు ఎంత స్మార్ట్‌గా వచ్చినా.. వాటికి అంతే డేటా వినియోగించాల్సిందే. ఫోన్ల వినియోగం ఎంత పెరిగినా నెట్‌వర్క్ ఎంత బిజీ అయినా ఫోన్లలో వచ్చే బ్యాటరీల్లో పెద్దగా మార్పు మాత్రం ఉండడం లేదు. మహా అయితే రెండు రోజుల బ్యాకప్‌తో బ్యాటరీ ఉన్న ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో 50 ఏళ్లపాటు చార్జింగ్ పెట్టకున్నా నడిచే బ్యాటరీ వస్తే.. ఆశ్చర్యమే కదా. చైనా ఇప్పుడు అదే పని చేసింది. చిన్న కాయిన్‌సైజ్ బ్యాటరీని రూపొందించి మొబైల్, ట్యాబ్‌తోపాటు చిన్నా గ్రాడ్జెట్‌లలో సంచలనం సృష్టించబోతోంది.
డిజిటల్ యుగంలో బ్యాటరీలకు ప్రాధాన్యం..
ప్రస్తుతం నడుస్తున్నది అంతా డిజిట్ యుగమే. అనేక ఎలక్ట్రిక్ గాడ్జెట్‌లను నిత్యం వివిధ రంగాల్లో వినియోగిస్తున్నాం. అయితే వాటికి అవసరమైన బ్యాటరీలు, వాటి బ్యాకప్‌కు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఎలక్ట్రిక్ పరికరాలన్నింటికీ బ్యాటరీ అవసరం. ఎలక్ట్రిక్ బైక్ అయితే గరిష్టంగా 200 కిలోమీటర్లు వచ్చేవి అందుబాటులో ఉన్నాయ. ఈ తరుణంలో బ్యాటరీ సమస్యకు చైనా పరిష్కారం కనుగొన్నది.
న్యూక్లియర్ బ్యాటరీ..
చైనా బ్యాటరీ సమస్యలకు చెక్‌పెడుతూ అణు(న్యూక్లియర్) బ్యాటరీలను తయారు చేసింది. ఈ బ్యాటరీని చార్జింగ్ లేకుండా ఏకంగా 50 ఏళుల ఉపయోగించవచ్చు. చైనీస్ స్టార్టప్ కంపెనీ బెటావోల్ట్ దీనిని తయారు చేసింది. బీజింగ్ చెందిన కంపెనీ ఇది. సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని తాజాగా విడుదల చేసి ప్రపంచానికి సవాల్ విసిరింది. ప్రస్తుతం ఈ బ్యాటరీలను స్మార్ట్ ఫోన్‌తోపాటు, ఇతర చిన్నవాటి స్మార్ట్ గాడ్జెట్లలో మాత్రమే వినియోగించే అవకాశం ఉంది. వాటికోసమే చిన్నసైజులో దీనిని డెవలప్ చేశారు.
స్మార్ట్‌ఫోన్లలో సంచలన మార్పులు..
చిన్నసైజులో ఉండి 50 ఏళ్లపాటు బ్యాకప్ వచ్చే బ్యాటరీ రావడంతో ఇక స్మార్ట్‌ఫోన్లలో సంచలన మార్పులు రావడం ఖాయం. ఈ బ్యాటరీకి బెటావోల్ట్ సంస్థ బీవీ–100 అని పేరు పెట్టింది. దీనిని క్రిస్టల్ డైమండ్ సెమీ కండక్టర్ పొరలుగా చేసి అందులో నికెల్ ఉపయోగించి డెవపల్ చేశాకు. లిథియం బ్యాటరీలతో పోలిస్తే న్యూక్లియర్ బ్యాటరీ సామర్థ్యం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3,300 వాట్ల విద్యుత్‌ను నిల్వ చేసేసామర్థ్యం ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 ఏళ్లపాటు శక్తిని నిల్వ ఉంచుకుంటుంది. దీని నిర్వహణ కూడా చాలా తేలికగా ఉంటుందని తెలుస్తోంది.
రిలీజ్ మాత్రమే..
బెటావోల్ట్ కంపెనీ ప్రస్తుతం బ్యాటరీని రిలీజ్ మాత్రమే చేసింది. ప్రొడక్షన్ ఇంకా ప్రారంభించలేదు. దాదాపు మరో ఏడాదిలో బెటావోల్ట్ బ్యాటరీలు మార్టెలోకి రానున్నా. అవి అందుబాటులోకి వస్తే స్మార్ట్ గాజ్జెట్లలో సంచలన మార్పులు రావడం కాయం. భారీగా ఉత్పత్తి చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోంది. ఫోన్ల డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్ట్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.