Doordarshan Days: 1980లో టీవీలంటే ఎంతో క్రేజీ ఉండేది. టీవీ చూసేందుకు చాలా ఇష్టం చూపేవారు. దీంతో ప్రతి ఇంటిలో టీవీ ఉండకున్నా కొన్ని ఇళ్లల్లో మాత్రమే టీవీులు ఉండేవి. వాటికి యాంటెన్నాలు ఉండేవి. బొమ్మ మంచిగా రావాలంటే యాంటెన్నా ను కదిలించే వారు. అప్పట్లో క్రికెట్ కు బాగా ప్రాచుర్యం ఉండేది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే వారు. కరెంటు కూడా తక్కువగా ఉండేది. దీంతో కరెంటు ఉన్నప్పుడు ఎక్కువగా టీవీలు చూసేవారు. యాంటెన్నా సరిగా లేకుంటే బొమ్మ చక్కగా వచ్చేది కాదు. బొమ్మ బాగా వచ్చే వరకు యాంటెన్నా కదిలిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆ సమస్యలు లేకుండా పోయాయి. అన్నిఇళ్లల్లో సన్ డైరెక్టులే వచ్చాయి.

సెటప్ బాక్సులు లేని సమయంలో దూరదర్శన్ దే హవా. అప్పట్లో క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఎంతో ఆసక్తి చూపేవారు. మ్యాచ్ చూసేందుకు ఆతృతగా ఉండేవారు. సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ అంటే అందరికి ఎంతో ఇష్టం. దీంతో వారి ఆట కోసం మ్యాచ్ చూసేందుకు రెడీ అయిపోయేవారు. యాంటెన్నా సరిగా లేకపోతే బొమ్మ డ్యాన్సు చేస్తున్నట్లు కనిపించేది. దీంతో క్రికెట్ చూసేందుకు నానా తంటాలు పడేవారు. ప్రత్యేకంగా యాంటెన్నా వద్ద ఒకరు ఉండి సెట్ చేస్తూ చూసేవారు. అప్పట్లో అన్ని కష్టాలు ఉండేవి.
ప్రస్తుతం కాలం మారింది. ఇప్పుడు అలాంటి బాధలే కనిపించవు. యాంటెన్నాల కాలంలో టీవీ చూడటం కొంత ఇబ్బందిగానే ఉండేది. దీంతో అన్ని ప్రోగ్రాములు చూడాలని అనుకున్నా యాంటెన్నా సమస్యతో టీవీ సరిగా వచ్చేది కాదు. దీంతో అందులో బొమ్మలు డ్యాన్సులు చేస్తున్నట్లు కనిపించేవి. ఎన్ని ఇబ్బందులున్నా టీవీ మాత్రం చూసేవారు. ఓపికతో యాంటెన్నాను సరిచేసుకుని టీవీ ముందు కూర్చుండే వారు. అప్పట్లో ఆదివారం తెలుగు సినిమా, గురువారం చిత్రలహరి కార్యక్రమాలు వచ్చేవి. దీంతో వాటి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూసేవారు.

అప్పటి పరిస్థితులు విచిత్రంగా ఉండేవి. టీవీ చూడటానికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. అయినా ఎంతో ఓపికతో ఉండేవారు. ఇప్పుడేమో అన్ని అరచేతిలోనే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా సెల్ ల లోనే ఉంటోంది. దీంతో ప్రస్తుత పరిస్థితికి గతానికి ఎంతో తేడా ఉంది. అప్పట్లో టీవీల్లో వచ్చే బొమ్మలు డ్యాన్సులు చేసేవిగా ఉండేవని కామెంట్లు చేసేవారు. ఈ నేపథ్యంలో టీవీల యాంటెన్నాల గోల ఆనాటిది. దీంతో ఎనభైయవ దశకంలో ఉన్న ఇబ్బందులతో కూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
“Cricket on Doordarshan whilst adjusting the antenna direction, in the good old days” Forwarded to me by a friend of my vintage. Well, maybe it was an antenna problem or maybe they were just better dancers in those days! 😊 pic.twitter.com/zJ6eAueqrQ
— anand mahindra (@anandmahindra) October 17, 2022