women hate Chalapati Rao : వెయ్యికి పైగా సినిమాల్లో విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టు గా కమెడియన్ గా నటించి అశేష ప్రేక్షాదరణ పొందిన చలపతి రావు నేడు గుండెపోటు తో మరణించాడు..మొన్ననే కైకాల సత్య నారాయణ చనిపోయినప్పుడు ట్విట్టర్ లో ‘నువ్వు కూడా వెళ్లిపోయావ్ సత్యన్నా’ అంటూ ఎంతో ఎమోషనల్ గా ట్వీట్ వేసిన చలపతిరావు, ఇలా రెండు రోజుల్లోపే సత్యనారాయణ దగ్గరకి వెళ్ళిపోతాడని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు.

ఇండస్ట్రీ కి చెందిన లెజెండ్స్ అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరు వదిలి వెళ్లిపోవడం నిజంగా బాధాకరం..ముఖ్యంగా ఇండస్ట్రీ స్వర్ణ యుగానికి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు లేరు..ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు , కృష్ణం రాజు , మొన్న సత్యనారాయణ నేడు చలపతి రావు ఇలా నాటి తరానికి చెందిన ఈ మహానటులందరిని ఇండస్ట్రీ కోల్పోవడం ఎవ్వరు పూడ్చలేని లోటు..అయితే సినిమాలే లోకం అంటూ బ్రతికిన చలపతి రావు కి ఇండస్ట్రీ లో ఒక మాయని మచ్చ ఉంది.
అదేమిటి అంటే చలపతి రావు కి ఆడవాళ్ళ మీద గౌరవం లేదని అప్పట్లో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసాయి..కారణం ఒక ఈవెంట్ లో ‘ఆడవాళ్లు కేవలం పక్కలో పడుకోవడానికి మాత్రమే పనికొస్తారు’ అంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఆరోజుల్లో పెను దుమారం రేపింది..చలపతిరావు కి ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ మీద మంచి అభిప్రాయం లేదు..తన కళ్ళముందు వాళ్ళు చేస్తున్న దారుణాలన్నీ చూస్తూ వచ్చాడు..అందుకే అప్పటి నుండి ఆయనకీ ఆడవాళ్లు అంటే అసహ్య భావన కలిగింది అని అంటుంటారు..మన సంస్కృతి కి బిన్నంగా ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్స్ ప్రవర్తిస్తూ ఉంటారు..అలాంటివారిపై ఇండస్ట్రీ లో చాలామందికి చెడు అభిప్రాయం ఉంటుంది కానీ బయటపడరు.
కానీ చలపతి రావు వంటి కల్మషం లేని వ్యక్తులు ముక్కు సూటితనం తో ఉంటారు కాబట్టి ఏది దాచుకోరు బయటపెట్టేస్తుంటారు..ఇక చలపతి రావు అంత్యక్రియల విషయానికి వస్తే బుధవారం రోజున ఆయన అంత్యక్రియలు జరుగుతాయని చలపాయ్ కొడుకు రవి బాబు మీడియా కి తెలిపాడు..కూతురు విదేశాల్లో ఉండడం వల్ల ఆమె చివరి చూపు కోసమే బుధవారం రోజున అంత్యక్రియలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు రవిబాబు.