‘Avatar 2’ 10 days worldwide collections : డిసెంబర్ 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 కి పైగా భాషల్లో ఘనంగా విడుదలైన ‘అవతార్ 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రారంభం లో ఓపెనింగ్స్ పరంగా నిరాశపర్చినప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది..మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా , ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరియు అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కలెక్షన్స్ స్టడీ గానే ఉన్నాయి..పది రోజులకు కలిపి ఈ సినిమా 1 బిలియన్ మార్కు కి దగ్గరగా వచ్చేసింది.
1 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 8 వేల కోట్ల రూపాయిలు అన్నమాట..వాస్తవానికి అవతార్ వంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ కాబట్టి ఆ 1 బిలియన్ మార్కుని కేవలం మూడు రోజుల్లోనే అందుకుంటుందని అందరూ అనుకున్నారు..కానీ పది రోజులకు ఆ మార్కు కి దగ్గరగా వచ్చింది..అదొక్కటే నిరాశకి గురి చేసే విషయం.
ముందుగా తెలుగు స్టేట్స్ లో వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినట్టు తెలుస్తుంది..అక్కడ 3D స్క్రీన్స్ మరియు 4Dx , ఐమాక్స్ స్క్రీన్స్ ఉండడం వల్లే అంత భారీ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..పది రోజులకు గాను ఈ సినిమాకి అక్కడ 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట..ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 22 కోట్లు మరియు సీడెడ్ లో 7 కోట్ల 20 లక్షల రూపాయిల వసూళ్లను కలెక్ట్ చేసిందని..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 64 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు.
ఇక నార్త్ ఇండియా లో కూడా ఈ సినిమా కి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి..పదిరోజులకు గాను అక్కడ ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం..అలాగే తమిళనాడు లో 40 కోట్ల రూపాయిలు, కర్ణాటక లో 39 కోట్ల రూపాయిలు మరియు కేరళలో 20 కోట్ల రూపాయిలు వచ్చాయట..మొత్తం మీద ఇండియా వైడ్ ఈ చిత్రానికి ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.