whale vomit : సముద్రాల్లో సంచరించే ఈ భారీ జలచారల గురించి వినడమే కానీ.. ప్రత్యక్ష చూసిన వారు చాలా తక్కువ. టీవీలు, డిస్కవరీ లాంటి చానెల్స్ వచ్చాక వీటి గురించి జనాలు తెలుసుకుంటున్నారు. అయితే తిమింగలాలు వాంతి చేసుకుంటాయని.. వేటలో భాగంగా ఇవి స్రవించే వాంతికి కోట్ల విలువ ఉంటుందన్న సంగతి చాలా తక్కువమందికే తెలుసు. తిమింగళం వాంతి కోసం ప్రత్యేకంగా గజ ఈతగాళ్లు ఉంటారని.. మత్స్యకారులు ప్రయత్నిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా షిప్ లు వేసుకొని మరీ తిరుగుతుంటారు. ఇంతకీ ఈ తిమంగళం వాంతికి ఎందుకంత విలువ? ఎందుకు కోట్లు పలుకుతుంది? ఇది ఎలా బయటకొస్తుందన్న దానిపై స్పెషల్ స్టోరీ..

-తిమింగళం వాంతి ఎలా తయారవుతుంది?
స్పెర్మ్ తిమింగలాలు చేసుకునే వాంతికి కోట్ల విలువ ఉంటుంది. ఈ వాంతిని ‘అంబర్ గ్రిస్’ అంటారు. దీన్ని సముద్రంపై ‘తేలియాడే బంగారం’గా పిలుస్తారు. స్పెర్మ్ తిమింగలాల జీర్ణవ్యవస్థలో ఇది తయారవుతుంది. వేటాడినప్పుడు స్పెర్మ్ తిమింగళం ఒక ప్రత్యేకమైన పదార్థాలను విడుదల చేస్తాయి. ఇది స్పెర్మ్ తిమింగళం శరీరానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రక్షిస్తుంది. ఆ తర్వాత శరీరంలోని వ్యర్థాలను ఇది వాంతి చేస్తుంది. ఇది నీటిపై తేలుతుంది. సముద్రంలోని ఉప్పునీరు, సూర్యరకశ్మి కలయికతో ఈ తిమింగళం వాంతి కాస్తా ‘అంబర్ గ్రీస్’ అనే పదార్థంగా మారుతుంది.
-తిమింగళం వాంతితో ఉపయోగాలేంటి?
ఈ తిమింగళం వాంతి తొలుత దుర్వాసన వస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ దాని సువాసన అదిరిపోయేలా ఉంటుంది. అంబర్ గ్రిస్ తెలుపు, నలుపు, బూడిదరంగు కలిసిన నూనె పదార్థంలా ఉంటుంది. గుడ్డు లేదా గుండ్రంగా తయారవుతుంది. ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ తిమింగళం వాంతిని సెంట్, పెర్ఫ్యూమ్స్ లలో వాడుతారు. సాంప్రదాయ ఔషధాలలో సైతం వినియోగిస్తారు. అందుకే ఈ తిమింగళం వాంతికి అంత డిమాండ్
ఇటీవల తిమింగళం వాంతిని కొందరు రూ.10 కోట్లకు అమ్మిన విషయం తెలిసిందే. ఈ వాంతి ధర కేజీ రూ.30 లక్షల దాకా మార్కెట్లో ఉంటుంది. ఇటీవల మలేషియాలో ఓ మహిళ 5 కేజీల తిమింగళం వాంతి ముద్దను అమ్మితే ఆమెకు కోటిన్నర దాకా వచ్చింది. అత్యంత ఖరీదైనది కాబట్టే దీనికి ఇంత డిమాండ్ ఉంది.