Bandla Ganesh- Trivikram: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సమయంలో బండ్ల గణేష్ ఆడియో టేప్ కలకలం రేపింది. త్రివిక్రమ్ ని బూతులు తిడుతున్నట్లున్న బండ్ల ఆడియో ఫైల్ వైరల్ అయ్యింది. అప్పట్లో బండ్ల ఆ వాయిస్ నాది కాదు ఎవరో ఫ్యాబ్రికేట్ చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ వాయిస్ నాదే అని ఆయన ఒప్పుకున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి బండ్ల గణేష్ కి ఆహ్వానం అందలేదు. ఇదే విషయం అడుగుతూ బండ్ల గణేష్ కి పవన్ అభిమాని ఒకరు కాల్ చేశారు.

అన్నా మీరు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తున్నారా? అని బండ్ల గణేష్ ని ఫోన్ లో అభిమాని అడిగారు. లేదమ్మా నేను రావడం లేదు. నాకు ఇన్విటేషన్ లేదు. స్పీచ్ కూడా సిద్ధం చేసుకున్నాను. ఆ త్రివిక్రమ్ గాడు నేను రాకుండా అడ్డుపడుతున్నాడట. నేను వస్తే వాడు డామినేట్ ఐపోతాడనే భయంతో నాకు ఆహ్వానం లేకుండా చేస్తున్నాడు. నేను బయటే ఉంటాను. మీరు బండ్లన్న అంటూ నినాదాలు చేయండి. అప్పుడు నేను ఎంట్రీ ఇస్తా… అని బండ్ల గణేష్ ఆడియో కాల్ లో మాట్లాడడం జరిగింది. ఈ ఆడియో ఫైల్ లీక్ కావడంతో పెద్ద రచ్చ అయ్యింది. అయితే బండ్ల గణేష్ ఆ వాయిస్ నాది కాదన్నారు.
ఇది జరిగి నెలలు గడుస్తుండగా బండ్ల గణేష్ స్వయంగా స్పందించారు. ఆ ఆడియోలో ఉంది తన వాయిస్సే, మాట్లాడింది తనే అన్నారు. మనిషి అన్నాక కోపం వస్తుంది. అప్పట్లో కోపంతో ఏదో అన్నాను. తర్వాత ఆ డైరెక్టర్ కి సారీ చెప్పాను. ఆ చిన్న వివాదం మమ్మల్ని ఏ విధంగా దూరం చేయదు, అంటూ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ఆడియోలో ఉన్న దాంట్లో సగం మాత్రమే నా వాయిస్, మిగతాది నాది కాదంటూ మళ్ళీ ఫ్లేటు ఫిరాయించారు.

ఫైనల్ గా బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ని తిట్టాడని క్లారిటీ వచ్చేసింది. ఈ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టారనే వాదన ఉంది. అది జరిగాక మరలా బండ్ల గణేష్ తన దేవుడు పవన్ కళ్యాణ్ ని కలవలేదు. తన మిత్రుడు త్రివిక్రమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండ్ల పై పవన్ కోపంగా ఉన్నారని సమాచారం. ఇటీవల బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ షేర్ చేస్తూ, అవకాశం ఇస్తే రూ. 2000 కోట్లు వసూలు చేసే మూవీ చేస్తా అంటూ కామెంట్ పెట్టాడు.