Railway Station Boards: సముద్రమట్టంతో రైల్వే స్టేషన్ ఎత్తును ఎందుకు కొలుస్తారు.. స్టేషన్ బోర్డుపై ఇలా ఎందుకు రాస్తారు? దీని అర్థం ఏంటి?

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచినా రైల్వే వ్యవస్థకు ప్రత్యేక బోర్డు ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైలు కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో సుదూరం ప్రయాణం చేసేవారు తమకు తెలియకుండానే చాలా ఊర్లు సందర్శించాల్సి వస్తుంది.

Written By: Srinivas, Updated On : August 28, 2023 1:53 pm

Railway Station Boards

Follow us on

Railway Station Boards: భారతదేశంలో అత్యంత పొడవైన రవాణా సాధనం రైలు మార్గం అని చెప్పొచ్చు. రైళ్ల ద్వారా కొన్ని లక్షల మంది నిత్యం ప్రయాణిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో డైలీ ఉద్యోగులు, వ్యాపార వేత్తలతో పాటు సుదూర ప్రయాణికులకు రైలు మార్గమే అనువుగా ఉంటుంది. అందుకే ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ మెట్రో రైల్ వరకు వచ్చింది. దేశంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో రకంగా రైలులో ప్రయాణించే ఉంటారు. ఈ సమయంలో మనం రైలు చూస్తాం.. బోగీలు ఎన్ని ఉన్నయో లెక్కపెడుతాం.. కానీ రైల్వే స్టేషన్లో ఆ ప్రదేశాన్ని తెలిపేందుకు పసపు కలర్లో ఓ బోర్డు ఉంటుంది. దీనిపై అది ఏ ప్రాంతమే రాసి ఉంటుంది. ఆ కిందనే రెడ్ లెటర్స్ తో కొన్ని అక్షరాలు రాస్తారు. అవి ఎందుకు రాస్తారో తెలుసా? అయితే ఇది చదవండి..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచినా రైల్వే వ్యవస్థకు ప్రత్యేక బోర్డు ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైలు కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో సుదూరం ప్రయాణం చేసేవారు తమకు తెలియకుండానే చాలా ఊర్లు సందర్శించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏ ప్రదేశం ఎలాంటిదో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే కొత్త ఊరికి వెళ్లినప్పుడు అది ఎలాంటి పరిస్థితుల్లో నిర్మించబడిందో తెలుసుకోవడానికి సమాచారం అందుబాటులో ఉండదు. దీంతో కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.

అదేంటంటే.. రైల్వే బోర్డుపై ఇలా రెడ్ లెటర్లను సముద్రం మట్టానికి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉందో తెలుపుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం రోడ్ అనే బోర్డుపై MSL 30.07 అని ఉంది. ఈ ప్రాంతం బంగాళాఖాతానికి సమీపంలో ఉన్నందున సముద్ర మట్టానికి 30 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపే విధంగా ఇలా రాశారు. అలాగేమిగతా ప్రాంతాల్లో కూడా ఆయా ఎత్తును బట్టి లిఖిస్తారు. ఇలా రైల్వే బోర్డులపై మాత్రమే కాకుండా పోస్టుబాక్స్ లపై కూడా ఇలా రాయాలని గతంలో ఆదేశాలు ఉన్నాయి.

సముద్ర మట్టానికి ఒక ప్రాంతం ఎంత ఎత్తులో ఉందో తెలుసుకోవడానికి ఇలా రాస్తారు. అయితే ఇది ఎవరికి ఉపయోగం అన్న సందేహం కలుగుతుంది. ఇంజనీర్లు, రైల్వే పనులు నిర్వహించే వారికి ఇది ఉపయోగపడుతుంది. కొత్తవారికి సమాచారం తెలిపే విధంగా ఇలా రాస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై ఇలా రాయాలని చెప్పారు. అందువల్ల రైల్వే బోర్డులపై ఇలా ప్రత్యేకంగారాశారు.