
Vijayasai Reddy- Jagan: వైసీపీలో నెంబర్ 2గా వెలుగు వెలుగిన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ప్రతి విషయంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు చురుకలంటిస్తుండే ఆయన ఈ మధ్య ఎందుకు స్పందించడం లేదు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ రాష్ట్ర రాజకీయాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన దూరం జరుగుతున్నారనే పుకార్లు ఎక్కువయ్యాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి ఎక్కువగా వైజాగ్‌లోనే మకాం వేసి కార్యకలాపాలు నిర్వహించేవారు. ఉత్తరాంధ్రలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంలో మందుండేవారు. అక్కడ నేతలకు పెద్ద దిక్కుగా మారారు. ఒకానొక దశలో వైసీపీలో రెండో స్ధానం ఆయనదే అన్న రీతిలో వ్యవహరించారు. పార్టీలో డ్రబుల్ షుటర్‌గా మారారు.
ఉత్తరాంధ్రలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నియామకంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. దీంతో ఆయన అలకబూనినట్లు చెబుతున్నారు. ఆ తరువాత ట్విట్టర్‌లలో మాత్రమే స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలపై దూకుడు తగ్గించారు. ఉత్తరాంధ్ర నాయకులు ఆయన దగ్గర ఏవైనా ఫిర్యాదులు తెలియజేసినా, పనులు జరగకపోవడంతో మరింత అసహనానికి గురవుతున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో కూడా పెద్దగా కనిపించలేదు. ఆ ఒక్క రోజు మాత్రం సమ్మిట్ కు వచ్చిన వారితో గడిపారు. నిర్వహణ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోలేదు. అంతేగాక, ఈ మధ్య తారకరత్న మృతి చెందినప్పుడు చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన హడావుడి కనబడలేదు. ఓటు వేసిన ఆయన మీడియాతో మాట్లాడుకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లను విమర్శిస్తూ జగన్ సూచించారని, అయినా, ఆయన మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా విజయిసారెడ్డి వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తున్నారా లేదా జగన్ తో ఎడమొహంగా ఉంటున్నారా? అనేది తేలాల్సి ఉంది.