
Bad Breath: నోటి దుర్వాసన మనల్ని ఇబ్బందులు పెడుతుంది. నలుగురిలో తిరగాలంటే ఏదోలా ఉంటుంది. వాసన వస్తుందని మాట్లాడటానికి ఇష్టపడరు. తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోలేరు. నోటి దుర్వాసనను దూరం చేసుకునేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. నోటి దుర్వాసను తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని పాటించి తమ సమస్య నుంచి ఉపశమనం పొందాలని భావిస్తుంటారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తారు. నోటి దుర్వాసన ఇటీవల కాలంలో చాలా మందిని బాధిస్తున్న సమస్యల్లో ఒకటి.
ఎక్కువగా నీరు తాగాలి
నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగాలి. నోరు పొడిబారకుండా చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండాలంటే తగినంత నీరు తాగితేనే ప్రయోజనం ఉంటుంది. ఆహారం తిన్న తరువాత సోంపు గింజలు వేసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన కూడా మయం కావడానికి మార్గం ఉంటుంది. నోటి దుర్వాసనకు సోంపు గింజలు చెక్ పెడతాయి. ప్రతిరోజు ఉదయం గ్రీన్ టీ తీసుకుంటే కూడా నోటి దుర్వాసన సమస్య రాకుండా ఉంటుంది. అందరు విధిగా ఇవి పాటిస్తే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు.
అల్లం
నోటి దుర్వాసనకు అల్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆహారం తీసుకున్న తరువాత అల్లం రసాన్ని వేడి నీటితో పుక్కిలించి తాగితే నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియాను దూరం చేసేందుకు సహాయపడతాయి. ఇంకా కొత్తిమీర కూడా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. కొత్తిమీరను నమలడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. కొత్తిమీరలో ఉండే క్లోరోఫిల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంటుగా మారి నోటి దుర్వాసన సమస్యను దూరం చేసేందుకు సాయపడుతుంది.

ఉప్పు నీరుతో..
రోజు ఒక గ్లాసు ఉప్పు నీరు నోట్లో వేసుకుని పుక్కిలించి వేయాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన ప్రభావం తగ్గుతుంది. పచ్చి క్యాప్షికం తినడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య లేకుండా పోతుంది. ఇందులో ఉండే విటమిన్ సి నోటి దుర్వాసనను అరికడుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య దరి చేరదు. ఇలా పై చిట్కాలు ఉపయోగించి నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో నోటి దుర్వాసన వస్తుందంటే జాగ్రత్తలు తీసుకుని సమస్య నుంచి పరిష్కారం పొందాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.