https://oktelugu.com/

Sridevi BoneyKapoor: రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. స్టార్ హీరో మోసం వల్లేనా?

Sridevi BoneyKapoor: అతిలోక సుందరి శ్రీదేవి నాడు అందరి కలల రాణి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఆమె పక్కన నటించాలని ఎంతో మంది హీరోలు క్యూలో ఉండేవారు. 20 ఏళ్ల క్రితం వరకూ శ్రీదేవి పేరు దేశమంతా ఊగిపోయేది. తమిళంలో కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి పాపులర్ అయిపోయింది. టాలవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది. అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభవన్ బాబు, కృష్ణల పక్కన శ్రీదేవినే తీసుకునే వారు. ఆమెతో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2022 / 12:14 PM IST
    Follow us on

    Sridevi BoneyKapoor: అతిలోక సుందరి శ్రీదేవి నాడు అందరి కలల రాణి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఆమె పక్కన నటించాలని ఎంతో మంది హీరోలు క్యూలో ఉండేవారు. 20 ఏళ్ల క్రితం వరకూ శ్రీదేవి పేరు దేశమంతా ఊగిపోయేది. తమిళంలో కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి పాపులర్ అయిపోయింది. టాలవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది.

    Sridevi BoneyKapoor

    అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభవన్ బాబు, కృష్ణల పక్కన శ్రీదేవినే తీసుకునే వారు. ఆమెతో నటిస్తే హిట్ లు రావడంతో అగ్రహీరోలంతా ఆమెనే రిఫర్ చేసేవారు. ఇక బాలీవుడ్ లోనూ శ్రీదేవి సత్తా చాటింది. బాలీవుడ్ అగ్రహీరోలతో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

    Also Read: Rashmi Gautam: రష్మీని ఫిలిం ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న నిర్మాత.. ఆ పని చేసిందట..

    సౌత్ ఇండియాను ఏలుతున్న టైంలోనే శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సూపర్ హిట్స్ అందుకుంది. శ్రీదేవికి బాలీవుడ్ లో మొదట ‘మిథున్ చక్రవర్తి’ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. అతడితోనే ఎక్కువ సినిమాలు చేసింది. అతడిని ఉండలేని స్టేజ్ కు శ్రీదేవి వెళ్లిపోయింది. అయితే అప్పటికే మిథున్ కు పెళ్లయ్యి పిల్లలు ఉన్నారు. శ్రీదేవితో మిథున్ కు ఎఫైర్ ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలోనే మిథున్ భార్య ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. దీంతో మిథున్ ఇక శ్రీదేవిని వదిలేసి అతడి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు.

    Sridevi, Mithun Chakraborty

    ఇక శ్రీదేవి -మిథున్ చక్రవర్తి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం కూడా కూడా జరిగింది. ఇక తన ప్రేమను కాదని మిథున్ శ్రీదేవిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే నాటి నిర్మాత.. శ్రీదేవితో పలు సినిమాలు నిర్మించిన బోనీకపూర్ ఆమెను ఓదార్చాడు. ఆమెకు దగ్గరయ్యాడు.

    ఈ క్రమంలోనే మళ్లీ వెనక్కి వచ్చిన మిథున్.. శ్రీదేవిని అప్రోచ్ అయ్యి బోనీకపూర్ కు రాఖీ కట్టమని చెప్పాడట.. అలా బోనీకి శ్రీదేవి రాఖీ కూడా కట్టిందట.. శ్రీదేవికి, బోనీకి మధ్య ఎఫైర్ ఉందని మిథున్ అనుమానించాడట.. మిథున్ కు ఎంత చెప్పినా వినిపించుకోలేదట.. ఆ తర్వాత మిథున్ మోసం తెలుసుకున్న శ్రీదేవి చివరకు తనకు అండగా నిలిచిన బోనీకూర్ కు దగ్గరైంది. అప్పటికే బోనీకపూర్ కు పెళ్లయ్యి పిల్లలు ఉన్నారు. అయినా కూడా పెళ్లికి ముందే బోనీకి దగ్గరైన శ్రీదేవి గర్భం కూడా దాల్చిందన్న టాక్ ఉంది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక 2018లో శ్రీదేవి దుబాయ్ బాత్ టబ్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

    Also Read: SS Rajamouli- Allu Aravind: రాజమౌళిని మోసం చేసిన అల్లు అరవింద్