
M.M Srilekha: రాజమౌళిది సినిమా ఫ్యామిలీ. ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యాక చాలా మంది కుటుంబ సభ్యులు వెలుగులోకి వచ్చారు. కీరవాణి ఆయన కంటే ముందే స్టార్ గా ఉన్నారు. అయితే కీరవాణికి మరింత పేరు రావడానికి రాజమౌళి కారణమయ్యాడు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి సినిమాలతో ఇండియాలోనే టాప్ రైటర్ గా ఎదిగారు. దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ రాజమౌళితోనే విజయేంద్ర ప్రసాద్ కి గుర్తింపు వచ్చింది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్, కొడుకు కార్తికేయ ఆల్ ఇన్ వన్. వదిన శ్రీవల్లి కూడా ఆయన సినిమాలకు పని చేస్తుంది.
కీరవాణి కొడుకు కాలభైరవ ఏకంగా ఆస్కార్ వేదిక మీద పాడే అవకాశం ఆర్ ఆర్ ఆర్ మూవీతో పొందాడు. కాబట్టి రాజమౌళి కుటుంబంలోని చాలా మంది కళాకారులు ఆయన దర్శకుడయ్యాక కెరీర్లో స్థిరపడ్డారు. అయితే ఇదే ఫ్యామిలీకి చెందిన కొందరు అట్టడుగున ఉండిపోయారు. ఫేమ్ పరంగా, సంపాదన పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. కాంచి, కళ్యాణి మాలిక్, శివశ్రీ దత్తా ఈ లిస్ట్ లో ఉన్నారు.
వీరందరి కంటే కూడా ఎం ఎం శ్రీలేఖ దురదృష్టవంతురాలు. రాజమౌళికి ఆమె కజిన్ అవుతారు. రాజమౌళి కంటే పదేళ్ల క్రితమే ఆమె పరిశ్రమలో అడుగుపెట్టారు. సంగీత దర్శకురాలిగా 75కి పైగా చిత్రాలకు పని చేశారు. 1992లో మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీలేఖ ప్రస్థానం మొదలైంది. అయితే ఆమె స్టార్ కాలేకపోయారు. టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీలేఖ మరుగున పడిపోయారు. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజ్ మహల్ చిత్రానికి శ్రీలేఖ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు.

శ్రీలేఖ మ్యూజిక్ అందించిన చివరి చిత్రం హిట్ 2. అడివి శేష్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. రాజమౌళి తన సొంత కుటుంబ సభ్యుడు అయినప్పటికీ సప్పోర్ట్ ఉండదని ఆమె మాటల్లో అర్థం అవుతుంది. కెరీర్ పరంగా రాజమౌళి, కీరవాణి చెల్లికి ఎలాంటి సహాయం చేయరు. ఆమె టాలెంట్ ఆధారంగా అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిందే. ఆర్థికంగా కూడా శ్రీలేఖ నిలదొక్కులేదు. ముప్పై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నా ఆమెకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాజమౌళి తన ఫ్యామిలీలో చాలా మందికి ఊతం ఇచ్చాడు. చెల్లికి మాత్రం అన్యాయం చేశాడు.