
Jagapathi Babu: నటుడు జగపతిబాబుది భిన్న మనస్తత్వం. ఆయనకు ఎలాంటి దాపరికాలు ఉండదు. మంచైనా చెడైనా ఓపెన్ గానే చెప్పేస్తారు. తాజాగా ఆయన తన తల్లి లైఫ్ స్టైల్ ఆయన రివీల్ చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. జగపతిబాబు మదర్ ఒంటరిగా ఒక చిన్న గదిలో ఉంటారట. ఆమె కొడుకుతో ఎందుకు ఉండరు అంటే… ఆమెకు అలా సింపుల్ గా జీవించడమే ఇష్టమట. ఆమె నివసిస్తున్న పరిసరాలు చూస్తే ఒకింత ఆశ్చర్యమేసింది. హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్న చిన్న గదిలో ఉంటున్నారు.
ఇక వేరే ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు. శ్రీరామనవమి నాడు జగపతిబాబు అమ్మ ఇంటికి వెళ్ళాడట. ఆమె పానకం చేస్తున్నా రమ్మన్నారట. అయితే ఓ ప్రత్యేక వంటకం ఆమెతో చెప్పి చేయించాడట జగపతిబాబు. అమ్మ చేసిన ఆ వంటకం దాదాపు పాతికేళ్ల తర్వాత తినబోతున్నాడట. పండగ రోజు మంచి భోజనం చేయబోతున్నట్లు జగపతిబాబు ఆ వీడియోలో వెల్లడించారు.

అయితే వాళ్ళ అమ్మ అంత సింపుల్ గా ఉంటున్నారని బయటి వాళ్లకు తెలియడం కూడా ఆమెకు ఇష్టం ఉండదట. అందుకే ఇల్లు మాత్రం చూపించి జగపతిబాబు వీడియో ఆఫ్ చేశారు. ఆయన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. జగపతి బాబు తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ వీబీ రాజేంద్రప్రసాద్. దర్శకత్వం కూడా చేశారు. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. ఆయన నిర్మించిన చిత్రాల్లో దసరా బుల్లోడు ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా ఉంది.
వీబీ రాజేంద్రప్రసాద్ 2015లో అనారోగ్యంతో మరణించారు. వీరికి జగపతిబాబుతో పాటు ఇద్దరు అమ్మాయిలు సంతానం. ఇక జగపతిబాబుకు ఇద్దరు అమ్మాయి. పెద్దమ్మాయి విదేశీయుడిని వివాహం చేసుకుంది. చిన్నమ్మాయి పెళ్లి విషయంలో కూడా నిర్ణయం తనదే అని జగపతిబాబు అన్నారు. నేనైతే పెళ్లి వద్దని ఆమెకు సూచించానని షాకింగ్ కామెంట్ చేశారు. ఒక దశలో సర్వం కోల్పోయిన జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యాక తిరిగి పుంజుకున్నారు. లెజెండ్ మూవీతో ఆయన దశ తిరిగింది. ఇప్పుడు జగపతిబాబు హైయెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకరు.