Youtuber Harsha Sai: ప్రార్ఠించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని చెబుతుంటారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే అది దేవుడికి చేసినట్లే అని అంటారు. కానీ మన దేశంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. వారిలో సేవా గుణం మాత్రం కనిపించదు. మనలో సేవ చేయాలనే గుణం ఉంటేనే సాధ్యం అవుతుంది. లేదంటే కుదరదు. మనిషి ఎంత దానం చేసినా అంతకు మించి డబ్బు వస్తుందనేది మనవారు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో లోపల సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఎలాగైనా మనం సేవ చేసేందుకు ముందుకు రావడం జరుగుతుంది. మనలో సేవా గుణం ఉంటేనే మనకు కూడా ఆపద వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఆదుకుంటారు.

మనం కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియొద్దంటారు. మనం చేసే మంచి పనిలో మనిషి కనబడకున్నా ఫర్వాలేదు. ఇక్కడ మనం చెప్పుకునే వ్యక్తిపేరు హర్షసాయి. ఆయన ఎంతో మంది నిరుపేదలకు దానం చేస్తున్నారు. వారి అవసరాన్ని బట్టి ఇస్తున్నారు. దీంతో ఆయన పేరు మారుమోగుతోంది. ఒక నిరుపేద క్షురకునికి ఇల్లు కట్టించి వారికి దేవుడయ్యాడు. ఓ బాలికకు స్కూలు ఫీజు కట్టి ఆమెకు ఆరాధ్యుడయ్యాడు. ఇలా హర్షసాయి చేస్తున్న దానధర్మాలతో అతడికి ఎంతో మంది అభిమానులు తయారయ్యారు.
హర్షసాయి తను చేస్తున్న కార్యక్రమాలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఎక్కడైనా ఎవరికి ఆపద ఉందో తెలుసుకుని సాయం చేస్తున్నాడు. దీంతో వారందరు హర్షసాయి అంటే తమకు దేవుడని చెబుతున్నారు. హర్షసాయికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. అంత మొత్తంలో ఎలా దానం చేస్తున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. అతడు చేసే పనిలో వచ్చే డబ్బుతోనే ఇదంతా చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో తను చేసే పనికి కొందరైనా స్ఫూర్తి పొంది దానం చేయడానికి ముందుకొస్తారని చెబుతున్నాడు.

హర్షసాయి చేస్తున్న సేవా కార్యక్రమాలపై అందరిలో అనుమానాలు ఉన్నా అతడు మాత్రం తన పంథా వీడటం లేదు. సేవా గుణం మానడం లేదు. ఎవరికి ఎంత ఆపద ఉందో తెలుసుకుని మరీ దానం చేస్తున్నాడు. దీంతో వారంతా అతడి సేవలకు మురిసిపోతున్నారు. హర్షసాయి అంటే ఎవరో కాదు తమ పాలిట దేవుడని భావిస్తున్నారు. హర్షసాయి సేవా గుణానికి అందరు ఫిదా అవుతున్నారు. ఎక్కడైనా ఆపదలో ఎవరున్నా వారి గురించి తెలుసుకుని మరీ హర్షసాయి సాయం చేస్తున్నాడు. పదో పరకో కాదు ఏకంగా వారి అవసరానికి అనుగుణంగా ఇస్తున్నాడు.
దీంతో అతడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానాలు ఉన్నా అతడు మాత్రం తాను సంపాదించేదే దానం చేస్తున్నానని చెబుతున్నాడు. హర్షసాయి చేస్తున్న దానాల వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఆపద ఉన్న వారి గురించి తెలుసుకుని వారికి సకాలంలో డబ్బులు అందజేసి వారిని ఆదుకుంటున్నాడు. దీంతో అందరిలో అతడు ఓ దేవుడిలా మారాడు. ప్రస్తుతం హర్షసాయి చేస్తున్న దానాలతో పేద వారికి ఎంతో ఉపశమనం కలుగుతోంది.