Gangster Marriage: వాళ్లిద్దరూ గ్యాంగ్‌స్టర్లు.. ఇద్దరికీ డజన్ల కొద్దీ సేలను ఉన్నాయి. అయితే వా ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఇటీవల ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరు తాజాగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే గ్యాంగ్ స్టర్ అయిన వరుడు జైల్లో ఉన్నాడు. అయితే పెళ్లికి ఊహించని రీతిలో కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇద్దరు మార్చి 12న పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లితో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంతకీ వాళ్లు ఎవరు.. ఇద్దరిపై ఉన్న కేసులు ఏంటి.. పెళ్లికి ఎన్నిరోజులు అనుమతి వచ్చింది, పోలీసులు ఎందుకు భయపడుతున్నారు అనే వివరాలు తెలుసుకుందాం.
నాలుగేళ్లుగా ప్రేమ..
హరియాణాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడి, రాజస్థాన్‌కు చెందిన లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సందీప్ మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు. 2017లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌సింగ్ వద్ద పనిచేసిన అనుభవం అనురాధకు ఉంది. ఇద్దరూ దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాల్లో దిట్ట. వీరిపై డజనుకుపైగా కేసులు ఉన్నాయి. సందీప్‌పై కిడ్నాప్, మనీలాండరింగ్, బెదిరింపుల కేసులు ఉన్నాయి.
కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం..
సందీప్, అనురాధ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా 2020 పరిచయం అయ్యారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా 2020 ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత కేసుల కారణంగా ఇద్దరూ పోలీసుల నుంచి తప్పించకుని తిరుగులూ పలు రాష్ట్రాల్లో ప్రేమయాత్ర చేశారు. ఈ క్రమంలో 2021 జూలైలో పోలీసులు వీరిని పట్టుకున్నారు. అనురాధ బెయిల్‌పై బయటకు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ముహూర్తం ఫిక్స్..
బెయిల్‌పై బయటకు వచ్చిన అనురాధ పెళ్లికి ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు ముహూర్తం పెట్టుకున్నారు. మార్చి 12, 2024లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఢిల్లీలోని సోనీపత్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సందీప్ మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు.
పెళ్లికి పెరోల్..
ఇక పెళ్లి కారణంగా కోర్టు సందీప్‌కు పెరోల్ మంజూరు చేసింది. సందీప్ లాయర్లు కోర్టులో పెళ్లి కోసం పిటిషన్ వేయగా న్యాయమూర్తి మార్చి 12న 6 గంటలపాటు బయటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఇద్దర గ్యాంగ్‌స్టర్ల ప్రేమ వివాహానికి కోర్టు 6 గంటలు అనుమతి ఇవ్వడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మూడు రాష్ట్రాల్లో అలర్ట్..
ఇక గ్యాంగ్‌స్టర్లు సందీప్, అనురాధ పెళ్లి నేపథ్యంలో ఇద్దరి సొంత రాష్ట్రాలు హరియాణా, రాజస్థాన్ పోలీసులతోపాటు పెళ్లి జరుగనున్న ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ ఆయ్యారు. ఇద్దరి పెళ్లికి పెద్ద ఎత్తున గ్యాంగ్‌స్టర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గొడవలు జరుగుతాయని సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే అనురాధ నేర జీవితాన్ని వదిలేసిందని చెబుతున్నారు. కానీ, ఎందుకైనా మంచిదని పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆయుధాలు వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక స్వాడ్‌లను ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని వివాహ వేదిక వద్ద మోహరించారు. ప్రత్యర్థుల దాడుల నుంచి ఇద్దరినీ రక్షించేందుకే ఇలా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Why are the police of 3 states sweating over this wedding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com