Indian marriage system: ప్రపంచంలోని పాశ్చాత్యా దేశాల్లో డేటింగ్ లు.. పిల్లలను కనడాలు.. విడిపోవడాలు చాలా కామన్. కానీ మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఇంకా కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఉంది. పెద్ద కుటుంబాలు లేకపోయినా చీకు చింతా లేని చిన్న కుటుంబాలు బలంగానే ఉన్నాయి. భార్య, భర్త , పిల్లల వరకూ కలిసే ఉంటున్నారు. పిల్లలకోసం అయినా కలిసి సంసారం చేసే దంపతులు ఎందరో.. అన్నింటికి మించి ఓర్పు, నేర్పుతో జీవనం సాగించి కలకాలం విడిపోకుండా ఉంటున్నారు.
ఇటీవల సమాజంలో విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, శ్రీజ-కళ్యాణ్ ఇలా జంటల విడాకులు బయటపడ్డాయి. అయితే సమాజంలో చాలా జంటలు మనసులు కలవక ఇగోలతో విడిపోతూనే ఉన్నాయి. సెలబ్రెటీలు కావడంతో వారి సంసారాలు మీడియాకు ఎక్కాయి. మీడియాకు ఎక్కని ఎన్నో సంసారాలు రోజూ విడిపోతూనే ఉన్నాయి.
Also Read: అవసరాన్ని బట్టి మారుతున్న ఏపీ ‘ఆదాయం’?
ఈ కాలం యువతలో ఓపిక, ఓర్చుకొనే శక్తి ఉండడం లేదు. ఇగో ఫీలింగ్ తో నేనే గొప్ప అని బంధాలు వదిలేస్తున్నారు. లక్షల సంపాదిస్తున్నానన్న పొగరుతో భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం.. నచ్చినట్టు వ్యవహరించడంతో అవతలి వారు హర్ట్ అయ్యి వదిలేస్తున్నారు.
ఈ కాలంలో ఎవరూ అణిగిమణిగి ఉండడం లేదు. స్వతంత్ర భావాలతో బతికేస్తున్నారు. కాటికి కాలు చాపిన బిల్ గేట్స్ లాంటి దంపతులు కూడా ఆ ముదిమి వయసులో తోడునీడగా ఉండాల్సింది పోయి విడిపోయారంటే ఆ వయసులోనూ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, నిర్లక్ష్యాన్ని వారు సహించడం లేదన్న మాట.. మరి యువతీ యువకులు ఇక ఎలా సహిస్తారు.? అందుకే ఈ విడాకులు..
విడాకులు తీసుకుంటే ఇక వాళ్ల పీడ విరగడ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఒక బంధం ఏర్పడడానికి ఇద్దరు మనుషులు కలిస్తే కాదు.. రెండు కుటుంబాలు కలవాలి.. దానికి సంప్రదాయాలు కలిసిపోవాలి. అయితే విడిపోయాక మరో తోడు అంత ఈజీగా దొరకదు.. దొరికినా అది బలంగా నిలబడదు. అందుకే విడిపోవడం కష్టం.. కానీ అదే ఈ కాలంలో ఈజీ అవుతోంది. మళ్లీ బలమైన బంధాన్ని కలవడం కష్టం.. కానీ అది కూడా ఈజీగానే దొరికేస్తోంది.
సమాజంలో బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోయింది. ఎవరూ కొత్త గా వస్తే.. కొత్తగా ప్రేమ చూపిస్తే.. వన్ నైట్ స్టాండ్ లాగా ప్రేమను అప్పటికప్పుడు అనుభవించేస్తున్నారు. తమ కోసం ఉన్న వారి బంధాన్ని పక్కనపెట్టి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది కూడా విడాకులకు దారితీస్తోంది. మొత్తంగా వివాహేతర సంబంధాలే (ఎఫైర్లే) అన్ని జంటలు విడిపోవడానికి మూలకారణంగా చెప్పొచ్చు.
Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?