Samarasimha Reddy : ‘సమరసింహా రెడ్డి’ చిత్రంలో పృథ్వీ క్యారెక్టర్ కోసం ముందుగా ఆ హీరోని సంప్రదించారా..? మంచి ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

శ్రీకాంత్ కి ఆ పాత్ర ఎంతగానో నచ్చింది, కానీ డేట్స్ అప్పటికే ఆయన అరడజను సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు, షూటింగ్ లో కూడా వెంటనే పాల్గొనాల్సిన పరిస్థితి. డైరెక్టర్ బి గోపాల్ అడిగిన డేట్స్ కి శ్రీకాంత్ డేట్స్ కి మ్యాచ్ అవ్వకపోవడం తో ఈ చిత్రాన్ని ఆయన అయిష్టంగానే వదులుకోవాల్సి వచ్చిందట. ఒకవేళ శ్రీకాంత్ ఈ సినిమా చేసి ఉంటే మాత్రం, మూవీ రేంజ్ ఇంకా పెరిగేది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By: NARESH, Updated On : July 4, 2023 8:36 am
Follow us on

Samarasimha Reddy : టాలీవుడ్ లో ఫ్యాక్షన్ మూవీస్ కి ఆద్యం పోసిన చిత్రం ‘సమరసింహా రెడ్డి’. నందమూరి బాలకృష్ణ మరియు బి.గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆరోజుల్లోనే ఈ సినిమా 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది. నందమూరి ఫ్యాన్స్ కి ఈ సినిమా పేరు ఎత్తితేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇప్పటికీ కూడా ఈ చిత్రం ప్రేక్షకులకు ఏమాత్రం కూడా బోర్ కొట్టద్దు.

ఈ సినిమా తర్వాతనే టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. సుమారుగా దశాబ్దం పాటు ఆ ట్రెండ్ కొనసాగింది. బాలయ్య ఇందులో ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు చెల్లెలకు అన్నయ్య గా కనిపిస్తాడు, అలాగే ఫ్యాక్షన్ లీడర్ గా కూడా కనిపిస్తాడు. ఈ చిత్రం లో బాలయ్య , జయప్రకాశ్ రెడ్డి మరియు అంజలి జవేరి తర్వాత మన అందరం గుర్తించుకోదగ్గ పాత్ర చేసిన నటుడు పృథ్వీ.

ఇందులో ఆయన పాత్ర పేరు వాసు, బాలయ్య బాబు కి నమ్మిన బంటు గా, ఆయన కుడి భుజంగ అద్భుతమైన నటన కనబరుస్తాడు. అతని పాత్ర ఆడియన్స్ చేత కంటతడి పెట్టించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఎవరైనా ఒక యంగ్ హీరో చేస్తే బాగుంటుందని భావించాడట డైరెక్టర్ బి.గోపాల్, కథలో ఎంతో కీలకమైన పాత్ర,చిరకాలం గుర్తించుకోదగ్గ పాత్ర కాబట్టి ఒక అప్పటి యంగ్ హీరోస్ లో ఎవరినో ఒకరిని తీసుకునే ఉద్దేశ్యం తోనే హీరో శ్రీకాంత్ ని అడిగారట.