
Dating: పెళ్లికి మందు డేటింగ్ చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి డేటింగ్ చేస్తున్నామని కొందరు చెబుతున్నా.. దీని పేరుతో హద్దులు దాటుతున్నారు. పెళ్లికి ముందే అన్నీ కానిచ్చి ఆ తరువాత ఇతర వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు సిన్సియర్ గా డేటింగ్ చేసేవాళ్లు లేరని చెప్పలేం. స్నేహపూర్వక వాతావరణంలో ఉంటూ ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటారు. ఇదే అదనుగా తీసుకున్న కొందరు పెళ్లయిన వాళ్లు సైతం తాను బ్యాచ్ లర్ నే అని కటింగ్ ఇచ్చి మోసం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలా మోసపోయిన వాళ్లలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరితో డేటింగ్ చేయాలి? డేటింగ్ చేసే వ్యక్తికి పెళ్లయిందా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి? అనేది తెలుసుకుందాం.
ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నామంటే అతని గురించి చాలా మంది పూర్తి వివరాలు తెలుసుకోరు. పైకి మంచివారిలా ఉంటే చాలు వారి ప్రేమలో పడిపోతారు. కానీ కొందరు నటిస్తూ మోసం చేసేవారున్నారు. తాను ఎన్నో తప్పలు చేస్తున్నా వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారి గురించి తెలిస్తే వారితో మూవ్ కాకుండా ఉంటేనే బెటర్. వీరు ఎప్పటికైనా మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల వారితో డేటింగ్ చేయడం అంత మంచిది కాదు.
సాధారణంగా డేటింగ్ అనగానే అమ్మాయిలు పురుషులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారితో కలిసి పార్కులు, సినిమాలకు వెళ్తారు. కానీ కొందరు పురుషుల ఆలోచనల్లో తేడాలుంటాయి. అమ్మాయిలను వలలో వేసుకోవడానికి అముల్ బేబీలా నటిస్తారు. వారు అనుకున్న పని పూర్తయ్యేసరికి అనిగిమనిగి ఉంటారు. ఆ తరువాత చెప్పాపెట్టకుండా మాయమై పోతారు. అయితే అంతకుముందే హద్దులు దాటకుంటా అమ్మాయిలు జాగ్రత్త పడాలి. ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలి.

కొందరు పెళ్లయిన వారు కూడా తాను బ్యాచ్లర్ అంటూ కటింగ్ ఇస్తారు. అయితే వీరిని ఈజీగా గుర్తు పట్టొచ్చు. పెళ్లయిన వారు బిజీ లైఫ్ తో ఉంటారు. సాధారణ సమయాల్లో వీరు ప్రియురాలితో కలిసి ఉండరు. తన మొబైల్ డిటేయిల్స్ మీకు ఇవ్వరు. ఇచ్చినా అది వేరే నెంబర్ అయి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో కలిసి మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. తానెప్పుడు బిజీ అంటూ అబద్దాలు చెబుతారు. ఇలాంటి లక్షణాలున్న వారు పెళ్లయిన వారని గుర్తించాలి. వారితో డేటింగ్ చేయడం ద్వారా మీ జీవితం నాశనం అవడం తప్పమరొకటి ఉండదు.
మరి డేటింగ్ చేసేవాళ్లో మంచి వారుండరా? అంటే ఉంటారు. ఇలాంటి వారు డేటింగ్ రోజులను ఎక్కువగా కేటాయించరు. కొద్ది రోజుల్లోనే పెళ్లికి సిద్ధమవుతారు. తమ ఇంటికి తీసుకెళ్లి పేరెంట్స్ ను పరిచయం చేస్తారు. తను ప్రేమించే అమ్మాయితోనే జీవితం పంచుకోవాలని నిర్ణయించాక తన మొబైల్స్ తో సహా ఫ్యూచర్ ప్లాన్లు షేర్ చేసుకుంటారు. తనతో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. తన వుడ్ బి అంటూ పది మందికి పరిచయం చేసే వ్యక్తిని మంచివారిగా భావించొచ్చు అని కొందరు చెబుతున్నారు.