Divi Vadthya: మత్తెక్కించే కళ్ళతో, మతిపోగొట్టే శరీరాకృతితో కుర్రకారులను పిచ్చెక్కించే అతి తక్కువ మంది ఫిమేల్ సెలబ్రిటీస్ లో ఒకరు దివి. ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంస్టాగ్రామ్ లో ఈమె ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు, వేల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. అలా సోషల్ మీడియా లో ఎక్కువ ఫాలోయింగ్ రావడం వల్లే ఈమెకి బిగ్ బాస్ వంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పాల్గొనే ఛాన్స్ దక్కింది.
అప్పటి వరకు కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమైన దివి, ఈ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతే కాదు సినిమాల్లో కూడా బాగా అవకాశాలు సంపాదిస్తూ దూసుకుపోతుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన కంటెస్టెంట్స్ లో సినిమాల్లో మంచి అవకాశాలను సంపాదించిన ఏకైక కంటెస్టెంట్ దివి మాత్రమే అనుకుంట.
ఇక గత ఏడాది ఈమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాన్ని సంపాదించింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి దివి కి తన సినిమాలో కచ్చితంగా అవకాశం ఇస్తానని మాటిచ్చాడు.అవకాశం అంటే ఎదో చిన్న పాత్ర ఇస్తాడేమో అని అనుకున్నారు కానీ, కథని కీలక మలుపు తిప్పే రేంజ్ పాత్ర ఇస్తాడని మాత్రం దివి కూడా ఊహించలేదు.
ఈ సినిమా లో ఆమెకి మంచి గుర్తింపు రావడం తో ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను సంపాదిస్తుంది. ఇది ఇలా ఉండగా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది దివి, అలాగే ఈరోజు కూడా ఆమె కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అవి ఎంత హాట్ గా ఉన్నాయో మీరే చూడండి.