Divorce: “కలిసి జీవించేందుకు ఇష్టపడని పక్షంలో, విడాకులు తీసుకునేందుకు ఆరు నెలల దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఆ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే విడాకులు మంజూరు చేయాలి” అని నిన్న భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా! సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ.. మనదేశంలో విడిపోతున్న జంటల సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే.. ఇందుకు మన సంస్కృతి, సంప్రదాయాలే కారణం.. కానీ ప్రపంచ దేశాల్లో అలా లేదు.. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో, అంత తొందరగా విడిపోతున్నారు.
ఓ సంస్థ సర్వే ప్రకారం
ఇటీవల ఓ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ దేశాలు, వివాహ వ్యవస్థలు, వివాహం విచ్చిన్నమైతే తీసుకున్న విడాకులకు సంబంధించి సర్వే నిర్వహించింది. ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని కీలక విషయాలు వెల్లడించింది. ఈ జాబితాలో పోర్చుగల్ 94%, స్పెయిన్, 85% విడాకులతో మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. లక్సెం బర్గ్ 79%, రష్యా 73%, ఉక్రెయిన్ 70%, క్యూబా 55%, ఫిన్లాండ్ 55%, బెల్జియం 53%, ఫ్రాన్స్ 51%, స్వీడన్ 50 శాతం, నెదర్లాండ్ 48%, కెనడా 47%, డెన్మార్క్, దక్షిణ కొరియా 46%, యునైటెడ్ స్టేట్స్ 45%, చైనా 44%, ఆస్ట్రేలియా 43%, న్యూజిలాండ్ 41%, యునైటెడ్ కింగ్డమ్ 41%, జర్మనీ 38%, జపాన్ 35%, పోలాండ్ 33%, కొలంబియా 30%, టర్కీ 25%, బ్రెజిల్ 21%, దక్షిణాఫ్రికా, మెక్సికో 17%, ఇరాన్ 14 %, తజకిస్తాన్ 10%, వియత్నాంలో 7% జంటలు విడాకులు తీసుకుంటున్నాయి.
భారత్ లో ఎందుకు తక్కువ?
సాధారణంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలతో మిళితమై ఉంటుంది. కట్టుబాట్లు కూడా చాలా ఎక్కువ. దీనికి తోడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కొన్నిచోట్ల విచ్ఛిన్నమైనప్పటికీ చాలాచోట్ల ఇప్పటికి అంతే బలంగా ఉన్నాయి. అందువల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని పరిష్కరించే బాధ్యత పెద్దలు తీసుకుంటున్నారు. తద్వారా కుటుంబాలు నిలబడుతున్నాయి. అయితే ఇటీవల విదేశీ సంస్కృతి నేపథ్యంలో చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. అందువల్లే అది ఒక శాతానికి పెరిగింది. పైగా న్యాయస్థానాలు కూడా నిబంధనల విషయంలో సడలింపు ఇవ్వడంతో విడాకుల ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చని న్యాయా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఒకవేళ ఇదే జరిగితే భారత దేశంలో కూడా విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు విదేశాల్లో విడాకుల శాతం ఎందుకు పెరుగుతుంది అంటే.. అక్కడ వివాహ వ్యవస్థలో పెద్దల ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది, పైగా దంపతులు నిర్ణయాన్ని వారికే వదిలేస్తారు. అందుకే అక్కడ కలిసిన తర్వాత వీడిపోతారు. ఇక సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Which country has the highest divorce rate 2023
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com