Rishab Shetty- Prabhas: ఈమధ్య కాలం లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన సినిమా ‘కాంతారా’..ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇదే..ఎందుకంటే రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమై ఒక సినిమా 400 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లను రాబట్టడం గతం లో ఎప్పుడు జరగలేదు..అందుకే ట్రేడ్ పండితులు కాంతారా చిత్రాన్ని ఒక చరిత్ర అని సంబోధిస్తారు.

ఇప్పటికి ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది..వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ కూడా వస్తున్నాయి..ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ మరియు హీరో గా నటించిన రిషబ్ శెట్టి కి మాములు క్రేజ్ రాలేదు..అద్భుతమైన ప్రతిభ ని కనబర్చినందుకు గాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన లెజెండ్స్ అందరూ రిషబ్ శెట్టి ని ప్రశంసలతో ముంచి ఎత్తారు..ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే రిషబ్ శెట్టి ని తన ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా సన్మానించాడు.
అయితే రీసెంట్ గా ఆయన ప్రభాస్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘ఈమధ్యనే ప్రభాస్ గారి పుట్టినరోజునాడు ఆయనకీ ఫోన్ చేసి శుభాకాంక్షలను తెలియజేశాను..ఆయన నా శుభాకాంక్షలను పెద్దగా పట్టించుకోలేదు కానీ..కాంతారా మూవీ గురించి మాత్రం సుమారుగా గంటసేపు వరుకు నాతో ఫోన్ లో మాట్లాడారు..ఆయనతో మాట్లాడిన ఆ గంటసేపుని నా జీవితం లో మర్చిపోలేను.

ప్రభాస్ గారి గొప్పతనం గురించి నేను చాలా విన్నాను కానీ,ఆరోజు స్వయంగా నా కళ్ళతో చూసాను’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి.. ప్రభాస్ గొప్పతనం గురించి మనకి కూడా తెలిసిందే..తన తోటి హీరోలతో కూడా ఎలాంటి అహభావం చూపని గొప్పమనసు ఆయనది..రీసెంట్ గా తన తోటి స్టార్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సినిమాకి కూడా ఇంస్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలియచేసాడు.