Suma – Rajeev Kanakala : సుమ కనకాల.. ఈమె పేరుకు మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. గత 20 సంవత్సరాలుగా బుల్లితెరను ఏలుతోంది. ఈటీవీలో వచ్చే సుమ అడ్డా నుంచి మొదలు పెడితే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ల వరకు మొత్తం ఈమేదే హడావిడి. అలాంటి ఈనటి వివిధ షో ల షూటింగ్ నిమిత్తం ఒక్కోసారి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది.. కొన్నిసార్లు రోజుల తరబడి బయటికి వెళ్లాల్సి వస్తుంది. సుమ టీవీ తెర మీద కనిపించినంత మాత్రాన ఆమెకు ఏమీ అతీంద్రియ శక్తులు ఉండవు. ఆమె కూడా సాధారణ మహిళనే. ఆమెకు అందరి మహిళల్లాగానే ఉండాలని ఉంటుంది. భర్తతో కలిసి కాఫీ తాగాలని, పిల్లలతో కలిసి ముచ్చట్లు చెప్పాలని, అందరూ కలిసి సినిమా చూడాలని ఉంటుంది. కానీ అలాంటి కోరిక నెరవేర్చుకునేందుకు చాలా రోజుల తర్వాత సుమ ఇంటికి వచ్చింది.
సుమ కారు తన ఇంటికి సమీపంలో ఉండగానే ఆమెలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. ముఖంలో ఆనందం తాండవం చేస్తోంది. శిరోజాలు కట్ చేసుకున్నప్పటికీ రెండు మూడుసార్లు గాలికి అలా వదిలేసింది. డ్రైవర్ కారును ఇంటిముందు అలా ఆపాడో లేదో వెంటనే డోర్ తీసి లగేజీతో సహా కిందికి దిగింది. వాయు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. మరో ఎండ్ లో రాజీవ్ కనకాల కూడా ఏదో రాసుకుంటూ ఉన్నాడు. ఎవరో వస్తున్నట్టు అలికిడి వినిపించడంతో అతడు కూడా ఎగిరి గంతేసాడు. తాను రాసుకుంటున్న పేపర్లను గాలిలోకి ఎగరేశాడు.
డోర్ కాలింగ్ శబ్దం రావడంతో ఎవరో వచ్చారని ఆతృతగా తలుపు తీశాడు. సుమ కనకాల కనిపించడంతో రాజీవ్ కనకాల మొహం ఒక్కసారిగా మారిపోయింది. ” అప్పుడే ఎందుకు వచ్చావు? ఇంకో 20 లేదా 25 రోజులు ఉండ లేక పోయావా?” అంటూ రాజీవ్ కనకాల ప్రశ్నించడంతో సుమ ముఖంలో ఒక్కసారిగా నిర్వేదం కనిపించింది. ” వచ్చేసాను” అంటూ లగేజ్ తో లోపలికి వెళ్ళిపోయింది. సరే లోపలికి రా అంటూ రాజీవ్ ఆమెను ఆహ్వానించాడు. ఇది మొత్తం చదివిన తర్వాత ఈ వీడియో సీరియస్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసేందుకు రూపొందించారు. చాలా రోజులు ఇంటికి దూరమైన బాధలో ఉన్నట్టు సుమ నటించగా.. ఇంకెవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు రాజీవ్ కనకాల కనిపించారు.. మొత్తానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” అయ్యో సుమక్కా నువ్వు రావడం రాజీవ్ బావకు ఇష్టం లేదు అని” ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇక మిగతావారు రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram