Bhuvanagiri: ప్రియుడు దూరం పెట్టడంతో ఆ మహిళ చేసిన పని వైరల్

ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయ శాఖ అధికారిగా శిల్ప పనిచేస్తున్నారు. ఆమెకు 2012లో సుధీర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

Written By: Dharma, Updated On : November 11, 2023 3:35 pm

Bhuvanagiri

Follow us on

Bhuvanagiri: ఆమె గత రెండు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రియుడితో సన్నిహితంగా గడుపుతోంది. ఉన్నఫలంగా ప్రియుడు తనను దూరం చేయడాన్ని తట్టుకోలేకపోయింది. నిలదీసినా ఫలితం లేకపోయింది. దీంతో ఏకంగా కత్తితో దాడికి దిగింది. కత్తిపోట్లతో హల్ చల్ చేసింది. తెలంగాణలోని భువనగిరి కలెక్టరేట్ ప్రాంగణంలో వెలుగు చూసింది ఈ దారుణం. దాడి చేసింది వ్యవసాయ శాఖ అధికారి కాగా.. బాధితుడు అదే శాఖలో ఏఈఓ గా పని చేయడం విశేషం.

ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయ శాఖ అధికారిగా శిల్ప పనిచేస్తున్నారు. ఆమెకు 2012లో సుధీర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అదే మండలంలోని ఏ ఈ ఓ గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ తో శిల్పకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. వీరు గత కొంతకాలంగా సన్నిహితంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మనోజ్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించారు. అప్పటినుంచి మనోజ్ శిల్పకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట యాదగిరిగుట్ట మండలం మూసాయిపేటకు డిప్యూటేషన్ పై వెళ్లిపోయాడు. రెండు నెలలు సెలవు పెట్టాడు. శుక్రవారం కలెక్టరేట్ కు వచ్చి సెలవులు పొడిగించుకోవాలని భావించాడు.

అయితే అదే సమయంలో శిల్ప రావడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను ఎందుకు దూరం పెట్టావని ప్రశ్నించింది. నీవల్లే భర్తకు విడాకులు ఇచ్చానని.. దూరంగా ఉన్నానని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. ఈ తరుణంలో శిల్పా కత్తితో మనోజ్ పై దాడి చేసింది. మెడ, వీపు భాగంలో రెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటనతో కలెక్టరేట్లో ఉన్న వారంతా ఒక్కసారి షాక్ కు గురయ్యారు. పోలీసులు వచ్చి శిల్పను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ ను ఆసుపత్రికి తరలించారు.

అయితే పాము గత ఏడాది జూన్ 7న రహస్యంగా వివాహం చేసుకున్నామని శిల్ప చెబుతోంది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. తనతో ఉండాలని మనోజ్ పోస్ట్ చేశాడని చెప్పుకొచ్చింది. తన వెంట బాబును తీసుకువస్తానని చెప్పగా చంపేస్తానని హెచ్చరించాడని… మూడు నెలల నుంచి తనను పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అతడే తనపై దాడికి ప్రయత్నించాడని.. ఆత్మరక్షణ కోసమే తాను ఎదురు దాడి చేశానని చెబుతోంది. పోలీసులు మాత్రం హత్యాయత్నం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.