
Ganta Srinivasa Rao: రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసిపి తన సత్తాను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర పట్టబద్రుల స్థానాన్ని కోల్పోయిన చోట వైసీపీ పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం మరో ఉప ఎన్నిక తప్పదా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పిడిఎఫ్తో ఒప్పందం ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లు బదిలీతో టిడిపి విజయం సాధించింది. దీంతో విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని వైసిపి చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదని ప్రచారం మొదలైంది. దీనిని వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ కేంద్రంగానే తమ సత్తాను చాటాలని భావిస్తుంది. ఎందుకోసం కేలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సంబంధించిన నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఓడిన చోట గెలుపు సమాధానంతో..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎన్నికల్లో నువ్వు ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చింది. ఉప ఎన్నికలు.. స్థానిక సంస్థల్లోనూ టిడిపికి అవకాశం ఇవ్వలేదు. తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. కానీ పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం మూడు చోట్ల ఓటమి పా. ఇప్పుడు ఈ విజయాన్ని టిడిపి భారీగా ప్రచారం చేసుకుంటుంది. రాజధానుల అంశానికి ముడిపెడుతోంది. ఇవే ఫలితాలు వచ్చే ఎన్నికల్లోను రిపీట్ అవుతాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. దీంతో ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ కేంద్రంగా ప్రజల్లో తమకు ఆదరణ.. రాజధాని అంశంలో మద్దతు ఉందని చాటి చెప్పాలని వైసిపి అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం విశాఖలో మరో ఎన్నికల నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
గంటా రాజీనామాకు ఆమోదంతో ఎన్నికలు..
ఉత్తరాంధ్ర తో పాటుగా రాయలసీమలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. అయితే విశాఖ ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారుతుంది. ఎప్పటికి టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా లేఖ ఇచ్చి ఉన్నారు. 2021 ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్లో గంటా తన రాజీనామా లేఖ అందించారు. ఈ లేఖ పై స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా వైసీపీలో చేరతారనే ప్రచారం సాగిన ఇప్పుడు విశాఖ టిడిపిలో కీలకంగా మారారు. ఇప్పుడు గంట రాజీనామా ఆమోదించడం ద్వారా అక్కడ ఒపీనిక ఎదుర్కోవాలనేది వైసిపి నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. గంట రాజీనామా ఆమోదిస్తే అటు టిడిపికి ఎమ్మెల్యే తగ్గడంతో పాటుగా విశాఖ ఉప ఎన్నికల్లో గెలిచి తమ వైపే సాధారణ ఓటర్లు ఉన్నారని నిరూపించుకోవాలనేది వైసిపి అధినాయకత్వం వ్యూహంగా కనిపిస్తోంది.

కొత్త వ్యూహంతో బరిలోకి వైసిపి..
వైసిపి నాయకత్వం ఎన్నికకు వెళ్లాలని నిర్ణయిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరికొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ఉపఎన్నిక జరగాలంటే అసెంబ్లీ కార్యాలయం ఖాళీ నోటిఫై చేసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. నిర్వహించిన మరికొద్ది నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్నిక ద్వారా టిడిపి జనసేన పొత్తు పై స్పష్టత రానుంది. అదే సమయంలో విశాఖలో కచ్చితంగా గెలిచి తమ బలం చాటాలనేది వైసిపి వ్యూహంగా కనిపిస్తోంది. మరి అధికార వైసీపీలో చర్చ జరుగుతున్నట్టుగా గంట రాజీనామాను ఆమోదిస్తారా..? ఉప ఎన్నిక జరుగుతుందా..? అన్నది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.