Sailing Stones- Death Valley: అదో ఎడారి ప్రాంతం. ఎటు చూసినా మనుషులు ఉండరు. రాళ్లు మాత్రం ఉంటాయి. కానీ అవి కదిలే రాళ్లు. లోకంలో చాలా వింతలు జరుగుతుంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి. కదిలే రాళ్లను మనం ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ మాత్రం రాళ్లు కదులుతాయి. వాటి ఆనవాళ్లు మాత్రం మనకు కనిపిస్తాయి. ఇంత వింత గొలుపుతున్న ప్రాంతం ఎక్కడుందో అని తెలుసుకోవాలని ఉందా? అయితే వినండి. ఇది అమెరికాలోని మధ్య కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో ఉన్న ప్రాంతం. దీన్ని డెత్ వ్యాలీ అంటే మృత్యులోయ అని పిలుస్తారు. ఇక్కడ జనసంచారం ఉండదు. ఈ ప్రదేశం చుట్టు ఎత్తైన కొండలు కనబడతాయి.

విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడి రాళ్లు కదులుతాయి. దీన్ని సెయిలింగ్ స్టోన్స్, స్లైడింగ్ రాక్స్, మూవింగ్ రాక్స్ అని పలు పేర్లతో పిలుస్తారు. ఎడారిలో ఎండిన సరస్సులో బరువైన రాతిశిలలు కదులుతుండటంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఒక్కో రాతి శిల బరువు 700 పౌండ్లున్నా అది ఒక చోట నుంచి మరో చోటుకు కదలడం ఓ వింతే. దీనిలో ఉన్న సంగతులు అర్థం కాక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. రాళ్లు కదలడానికి కారణాలేంటనే విషయం ఇప్పటికి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ రాళ్లు రోజు కదలవు. రెండు మూడు సంవత్సరాలకోసారి కదులుతాయి. అవి కూా సమాంతరంగా కదలడం వాటి ప్రాముఖ్యత. అంతేకాదు రాయి పక్కన మరో రాయి దాని సమానంగా ఉంటే అది కూడా కదులుతుంది. కదలడం మొదలు పెడితే ఆ రాతితో పాటు మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దీంతో కదిలే రాళ్ల కథ అక్కడి వారిని ఆశ్చర్యపరుస్తోంది. రాళ్లు కదలడానికి కారణాలేంటనేది అంతుచిక్కడం లేదు. పరిశోధనలకు సైతం ఆ రహస్యం చిక్కడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకున్నారు. వీటి కథేమిటో తెలుసుకోవాలని తహతహలాడుతున్నా దాని మిస్టరీ చిక్కడం లేదు.

1955, 1972 సంవత్సరాల్లో బాండ్ పార్స్, డ్విట్ కేరే అనే శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టినా ఇంతవరకు ఏ విషయం తెలియలేదు. 30 రాతి శిలల్లో కదలికలు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని శిలలను గుర్తించి వాటిని గురించి పరిశీలిస్తే అవి రెండు వందల నుంచి రెండు వందల పన్నెండు అడుగులు కదలనట్లు తెలుస్తోంది. 1993లో జరిపిన పరిశోధనలో కరెన్ అనే రాయి అరమైలు వరకు ప్రయాణించిందని కనుగొన్నారు. కదిలే రాళ్లలో ఏ శక్తి ఉందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది. అందులో ఏ మంత్రం దాగి ఉందనేది ఎవరికి దొరకడం లేదు. దీంో కదిలే రాళ్ల కథ ఎప్పటికి తెలిసేనో అని అందరు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.