Sukumar Remunaration: సుకుమార్.. క్రియేటివ్ జీనియస్.. సినిమాను కొత్తగా.. వినూత్నంగా లాజికల్ గా చూపించడంలో అందెవేసిన చేయి. ఎంతలా అంటే రాజమౌళి సైతం సుకుమార్ సినిమాలను చూసి కొన్ని కాపీ కొట్టానని.. ‘మర్యాదరామన్న’ సినిమా ప్రమోషన్ టైంలో చెప్పుకొచ్చాడు. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్ లో సుకుమార్ సత్తా చాటాడు. టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

ప్రస్తుతం తెలుగులో టాప్ దర్శకుడిగా సుకుమార్ ఉన్నారు. సుకుమార్ ప్రతీది లెక్కల మాస్టర్ గా క్యాలుకేషన్స్ వేసుకొని తీస్తాడని.. అందుకే అంత బాగా వస్తుందని చెబుతుంటారు. ఆర్య, 100% లవ్ , రంగస్థలం ఇలా హీరోను ఎలివేట్ చేయడంలో సుకుమార్ ది అందెవేసిన చేయి.
రంగస్థలంలో రాంచరణ్ తో ఎంత నేచురల్ గా తీశాడో.. పుష్పలో అల్లు అర్జున్ తో అంతే ఊరమాస్ గా సినిమా తెరకెక్కించి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. పుష్ప సినిమా బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..
Also Read: KCR IAS Postings : కేసీఆర్ దగ్గర పదవులు ఎవరికిస్తారు? ఎందుకిస్తారో తెలుసా?.. రహస్యం బయటపడింది!
పుష్పకు ముందు వరకూ తక్కువగా రెమ్యూనరేషన్ సుకుమార్ తీసుకునేవాడు. కానీ పుష్ప ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడంతో ఇక తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేశాడు.ఇప్పటివరకూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లలో రాజమౌళి, శంకర్ లు ఉండగా.. తాజాగా ఆ స్థానాన్ని సుకుమార్ సంపాదించాడు.
ప్రస్తుతం సుకుమార్ పుష్ప తర్వాత ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. పుష్పకు ముందు రూ.35-40 కోట్లు పుచ్చుకునే సుకుమార్.. ఇప్పుడు ఏకంగా పుష్ప2కు 50 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: K Laxman: డా. కే లక్ష్మన్ కు బీజేపీ ఎందుకు రాజ్యసభ సీటు ఇచ్చింది? అసలు కథేంటి?
Recommended Videos:
[…] […]