https://oktelugu.com/

Mahesh Babu -Ramyakrishna : రమ్యకృష్ణకు హీరో మహేష్ బాబుకు సంబంధమేంటి?

Mahesh Babu -Ramyakrishna : త్రివిక్రమ్ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ రోల్ ఉంటుంది. అత్తారింటికి దారేది మూవీ నుండి ఆయన ఈ టెక్నిక్ వాడుతున్నారు. అలిగి పుట్టింటిని బహిష్కరించిన అత్త చుట్టే ఆ సినిమా కథ రాశారు. నదియా పాత్ర పవన్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఒక స్టార్ హీరో సినిమాలో లేడీ రోల్ కి ఆ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడం నిజంగా సాహసమే. ప్రయోగం ఫలించడంతో త్రివిక్రమ్ ఆ ఫార్ములా వదలకుండా తన సినిమాల్లో […]

Written By: , Updated On : February 25, 2023 / 08:02 PM IST
Follow us on

Mahesh Babu -Ramyakrishna : త్రివిక్రమ్ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ రోల్ ఉంటుంది. అత్తారింటికి దారేది మూవీ నుండి ఆయన ఈ టెక్నిక్ వాడుతున్నారు. అలిగి పుట్టింటిని బహిష్కరించిన అత్త చుట్టే ఆ సినిమా కథ రాశారు. నదియా పాత్ర పవన్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఒక స్టార్ హీరో సినిమాలో లేడీ రోల్ కి ఆ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడం నిజంగా సాహసమే. ప్రయోగం ఫలించడంతో త్రివిక్రమ్ ఆ ఫార్ములా వదలకుండా తన సినిమాల్లో వాడుతున్నారు. అజ్ఞాతవాసి మూవీలో కుష్బూ, ‘అ ఆ’ మూవీలో మళ్ళీ నదియా, అల వైకుంఠపురంలో టబు పాత్రలు అత్తారింటికి దారేది చిత్ర స్పూర్తితో రాసుకున్నవే.

కాగా మహేష్ మూవీ కోసం కూడా ఒక పవర్ సీనియర్ హీరోయిన్ ని దించుతున్నారట. మహేష్ 28వ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర కథలో కూడా బలమైన లేడీ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారట. మహేష్-త్రివిక్రమ్ మూవీలో రమ్యకృష్ణ నటించడం అనివార్యమే అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక పవర్ ఫుల్ రోల్స్ కి రమ్యకృష్ణ బ్రాండ్ అంబాసిడర్. ఆ తరహా పాత్రల్లో ఆమెను కొట్టిన నటి లేదు.

నరసింహ నీలాంబరి, బాహుబలి శివగామి పాత్రలను ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే రమ్యకృష్ణ హీరో మహేష్ కి అమ్మగా నటిస్తున్నారా? లేక తల్లిగా చేస్తున్నారా? అనేది ఆసక్తికరం. మరికొన్ని లీక్స్ ఈ చిత్రం నుండి వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ మహేష్ తాతయ్య రోల్ చేస్తున్నారట. ఇక జగపతిబాబు మెయిన్ విలన్ అట. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే… ఇది రీమేక్ కూడా కావచ్చు అంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అసలు మేటర్ తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

హీరోయిన్ పూజా హెగ్డే రెండోసారి మహేష్ తో జతకడుతున్నారు. గతంలో మహర్షి చిత్రంలో కలిసి నటించారు. మహర్షి సూపర్ హిట్ కొట్టింది. కాబట్టి మహేష్-పూజా హెగ్డేలది హిట్ పెయిర్ అని చెప్పొచ్చు. యంగ్ బ్యూటీ శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్నారట. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా… థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రూ. 10 కోట్ల ఖర్చుతో లగ్జరీ హౌస్ సెట్ వేశారట. అక్కడే నెక్స్ట్ షెడ్యూల్ జరగనుందని సమాచారం.