https://oktelugu.com/

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు ఏమైపోయాడు? సినిమాలు మానేశాడా?

Sampoornesh Babu: 2014లో విడుదలైన హృదయ కాలేయం ఓ సెన్సేషన్. ఆ సినిమా హీరో గురించి అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఇలాంటి హీరోలు కూడా ఉంటారా? అని ప్రేక్షకులు అనుకున్నారు. ఒక కామెడీ కాన్సెప్ట్ కి డీగ్లామర్ పర్సన్ సంపూర్ణేష్ బాబు బాగా సెట్ అయ్యాడు. హృదయ కాలేయం హిట్ కాగా సంపూ పేరు మారుమ్రోగింది. సంపూ అసలు పేరు నరసింహాచారి. సొంతూరులో గోల్డ్ వర్క్ చేస్తుంటాడు. బాగా పేద కుటుంబం. ఆయనకు భార్య ఇద్దరు […]

Written By:
  • Shiva
  • , Updated On : April 5, 2023 / 09:02 AM IST
    Follow us on

    Sampoornesh Babu

    Sampoornesh Babu: 2014లో విడుదలైన హృదయ కాలేయం ఓ సెన్సేషన్. ఆ సినిమా హీరో గురించి అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. ఇలాంటి హీరోలు కూడా ఉంటారా? అని ప్రేక్షకులు అనుకున్నారు. ఒక కామెడీ కాన్సెప్ట్ కి డీగ్లామర్ పర్సన్ సంపూర్ణేష్ బాబు బాగా సెట్ అయ్యాడు. హృదయ కాలేయం హిట్ కాగా సంపూ పేరు మారుమ్రోగింది. సంపూ అసలు పేరు నరసింహాచారి. సొంతూరులో గోల్డ్ వర్క్ చేస్తుంటాడు. బాగా పేద కుటుంబం. ఆయనకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సినిమా మీద పిచ్చితో ఖాళీగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి స్టూడియోల చుట్టూ తిరుగుతుండేవాడు.

    జుట్టు బాగా పెంచి రంగు రంగు బట్టల్లో విచిత్ర వేషధారణ మైంటైన్ చేసేవాడు. అలాంటి నరసింహాచారికి సాయి రాజేష్ హీరో ఆఫర్ ఇచ్చాడు. ఇది ఊహించని పరిణామం. నా దగ్గర ఓ చెత్త స్టోరీ ఉంది దానికి హీరోగా ఓ చెత్త నటుడు కావాలి… అది నువ్వే అని సాయి రాజేష్ చెప్పాడట. ఈ సినిమా విడుదలయ్యాక జనాలు మనల్ని కొట్టినా కొడతారు. కాబట్టి పేర్లు మార్చుకుందామని సాయి రాజేష్ సూచించాడట. అలా నరసింహాచారి సంపూర్ణేష్ బాబు అయ్యాడు. సాయి రాజేష్ తన పేరు స్టీవెన్ శంకర్ గా మార్చి డైరెక్షన్ చేశాడు.

    సంపూ కాస్ట్యూమ్స్ కూడా కోటీ సెంటర్ లో కొనేవారట. అలా మినిమమ్ బడ్జెట్ తో హృదయ కాలేయం మూవీ చేసి విడుదల చేశారు. అది కాస్తా సక్సెస్ అయ్యింది. హృదయ కాలేయం అనంతరం కొన్ని సినిమాలో కామెడీ రోల్స్ చేశాడు. సూర్య సింగం సినిమాకు స్పూఫ్ గా సింగం 123 చేశాడు. అనుకున్నంతగా ఆడలేదు. అయితే 2019లో విడుదలైన కొబ్బరి మట్ట ఆయనకు మరోసారి బ్రేక్ ఇచ్చింది.

    Sampoornesh Babu

    2021లో కాలీఫ్లవర్, బజార్ రౌడీ చిత్రాలు చేశాడు. ధగడ్ సాంబ టైటిల్ తో ఓ మూవీ చేశారు. అది విడుదలైన దాఖలాలు లేవు. ఈ మధ్య సంపూర్ణేష్ బాబు కనిపించడం మానేశారు. కొత్త చిత్రాల ప్రకటన లేదు. ఇతర హీరోల చిత్రాల్లో కూడా నటించడం లేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాలు చేసి అలరించాలని కోరుకుంటున్నారు. సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు బర్త్ డే వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది.