
Amit Shah: అమిత్‌షా.. భారతీయ జనతాపార్టీలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి. మోదీ–షా ద్వయం వ్యూహాలతో దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాజకీయ వ్యూహాలే కాకుండా దేశ భద్రత, ఉగ్రవాదం నిర్మూలనతోపాటు కశ్మీర్‌లో ఆర్టిక్ 370 రద్దు వెనుక కూడా వీరిద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మోదీ ప్రధాని కాకముందు చేసిన పర్యటన సందర్భంగా ఎదుర్కొన్న పరిస్థితి, 2019లో అమిత్‌షా పర్యటన ఆర్టికల్ 370 రద్దులో కీలక పాత్ర పోషించాయి. మోదీ–షా కమిట్ అయితే అసాధాన్యన్ని కూడా సుసాధ్యం చేయగలరు. ఇందుకు ఆర్టికల్ 370 రద్దు ఒక మచ్చుతునక అని మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజేఎస్.థిల్లాన్ తెలిపారు. 370 రద్దు వెనుక హోంమంత్రి కసరత్తును 14న విడుదల కానున్న తన పుస్తకం ‘‘కిత్నే గాజీ ఆయే..కిత్నే గాజీ గయే’’లో వివరించారు.
Also Read: Kotamreddy Sridhar Reddy: ట్రోల్ ఆఫ్ ది డే: అడ్డంగా దొరికిపోయిన కోటం హాసన్
అమిత్‌షా పర్యటనతో కీలక పరిణామాలు..
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370 రద్దు వెనుక 2019 జూన్‌లో శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన పర్యటన కీలకపాత్ర పోషించిందని మాజీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్.థిల్లాన్ స్పష్టం చేశారు. ఈ అధికరణం రద్దు అయితే తలెత్తే పరిణామాలపై హోంమంత్రి ముందస్తుగానే భారీ కసరత్తు చేశారని పేర్కొన్నారు. ‘‘2019, జూన్ 26న అమిత్ షా శ్రీనగర్ వచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన పేషీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఉదయం 7 గంటలకు కలవమని. సమావేశంలో చాలా సున్నితమైన అంశాలు చర్చకు వచ్చాయి. 370 రద్దు చేస్తే, పాక్ స్పందనెలా ఉంటుందన్న అంశంపైనా చర్చించాం. ఒక ప్రొఫెషనల్‌గా ఇక్కడో విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నా. సమావేశం ఎజెండాపైనా, విషయంపైనా హోంమంత్రి పూర్తి స్పష్టతతో ఉన్నారు. బహుశా ఆయన విపరీతమైన పరిశోధన, కసరత్తు చేసి ఉంటారు. నా అభిప్రాయాన్నీ అడిగారు. చరిత్ర రాయాలంటే.. ఎవరో ఒకరు చరిత్ర సృష్టించాలని చెప్పాను’’ అని ఆ కీలక సమావేశం గురించి థిల్లాన్ తన పుస్తకంలో వివరించారు.

అదే ఆఖరు సమావేశం..
జమ్మూకశ్మీర్‌లో నవశకం రావాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా సుదీర్ఘ కసరత్తే చేశారు.
ఆర్టికల్ 370 రద్దు చేస్తే జరిగే పరిణామాలన్నీ ఊహించారు. వాటిని ఎలా కట్టడి చేయాలో వ్యూహరచన చేశారు. స్థానిక నేతలు ఏం చేస్తారన్న విషయంపైనా అంచనాకు వచ్చారు. వారు రోడ్లపైకి వచ్చి స్థానికులను రెచ్చగొట్టకుండా ఉంచేందుకు ఏం చేయాలో సమాలోచనలు చేశారు. వ్యతిరేక శక్తుల అణచివేతకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. అయితే ఇంత సుదీర్ఘ కసరత్తు చేసినా ఆర్టికల్ 370 రద్దు కోసమే అన్న ఆలోచన ఎవరికీ రాకుండా చేశారు. ఎక్కడా ఈ విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధాని, హోంమంత్రి తర్వాత ఆ విషయం తెలిసిన మూడో వ్యక్తి అజిత్ దోవల్. సైనిక వ్యూహరచనలో దోవల్ కీలకంగా వ్యవహరించారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు శ్రీనగర్‌లో జరిగిన ఆఖరి సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్‌తో జరిపిన కీలక సమావేశంలో ఈ విషయం థిల్లాన్‌కు తెలిపారు అమిత్‌షా. కశ్మీర్‌పై షాకు ఉన్న కమిట్‌మెంట్ చూసి థిల్లాన్ షాక్ అయ్యానని ఆయన రాసిన పుస్తకంలో వివరించారు. 2019, ఆగస్టు 5న అధికరణం రద్దు అయింది. మొత్తంగా 370 రద్దు ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి.
Also Read:PM Modi Meets Actors: కేజీఎఫ్, కాంతారా హీరోలతో మోడీ స్కెచ్.. ప్రత్యర్థులకు నోట మాటరాదంతే!