Prabhas- Krishnam Raju: ప్రభాస్ ఇటీవల అతిపెద్ద కుదుపుకు గురయ్యారు. ఆయన తన గాడ్ ఫాదర్, మెంటర్, గైడ్, రోల్ మోడల్ అయిన పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయారు. 2022 సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. తనకు జీవితం ఇచ్చిన కృష్ణంరాజు మరణాన్ని జీర్ణించుకోవడం ప్రభాస్ కి కష్టమైంది. దగ్గరుండి ఆయన మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేశాడు. కృష్ణంరాజుకు పుట్టి పెరిగిన మొగల్తూరు అంటే చాలా అభిమానం. ఏడాదికి రెండుసార్లు అక్కడకు వెళ్లి బంధువులను, మిత్రులను కలిసేవాడు. అందుకే కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరులో భారీగా ఏర్పాటు చేశారు.

సినీ రాజకీయ ప్రముఖులు మొగల్తూరుకు వెళ్లి కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఇక ప్రభాస్ రాకను తెలుకున్న అభిమానులు లక్షల మంది మొగల్తూరుకు పోటెత్తారు. అభిమానులకు అరుదైన వంటకాలతో ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి చేయితిరిగిన వంటగాళ్లను తీసుకెళ్లి అద్భుతమైన నాన్ వెజ్ ఐటమ్స్ చేయించారు.
కాగా ప్రభాస్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో ఆయన పెదనాన్నను తలచుకొని ఎమోషనల్ అయ్యారు. షోలో కృష్ణంరాజు స్పెషల్ ఏవీ ప్రదర్శించారు. ఆ వీడియో చూశాక ప్రభాస్ మరింత భావోద్వేగానికి గురయ్యారు. ఆయన లేకపోతే నేను లేను. మా జీవితాలు ఇలా ఉండేవి కాదని ప్రభాస్ కన్నీరు పెట్టుకున్నారు. పట్టుదలతో చెన్నైకి వెళ్లి పరిశ్రమలో అడుగుపెట్టి 10-12 ఏళ్ళు విలన్ గా చేశారు. తర్వాత హీరోగా నిలదొక్కున్నారు.

పెదనాన్న సొంత బ్యానర్ ఏర్పాటు చేసి మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేశారు. మా కుటుంబం అంతా ఆయన్ని ఎంతగానో మిస్ అవుతున్నాము. పెదనాన్న చనిపోవడానికి ముందు నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. నేను ఆ నెలరోజులు ఆసుపత్రికి వెళుతూ ఆయన ఆరోగ్యం సమీక్షిస్తూ ఉండేవాడిని. షూటింగ్ లో ఉన్నప్పటికీ డాక్టర్స్ నుండి ఎప్పటికప్పుడూ సమాచారం అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన దూరం కావడం మా జీవితాల్లో అతి పెద్ద లోటు అని ప్రభాస్ ఎమోషనల్ అయ్యారట. జనవరి 6న ఆహాలో ప్రసారం కానున్న బాహుబలి 2 ఎపిసోడ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.