Tamannaah Assets: తమన్నా చిత్ర పరిశ్రమకు వచ్చి 17 ఏళ్ల దాటిపోయింది. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. టాలీవుడ్ టు బాలీవుడ్ దాదాపు అన్ని పరిశ్రమల్లో పని చేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్టార్డం అనుభవించారు. రెండు తరాల స్టార్స్ ని కవర్ చేసిన ఘనత తమన్నా సొంతం. ఎన్టీఆర్, మహేష్, పవన్, చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లలో ఎవరినీ వదల్లేదు. అలాగే సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునల చిత్రాల్లో నటించారు. పూజా హెగ్డే, రష్మిక మందాన, కీర్తి వంటి యంగ్ బ్యూటీస్ టాలీవుడ్ ని ఏలేస్తున్నా తమన్నా జోరు తగ్గలేదు. తనకు రావాల్సిన ఆఫర్స్ ఆమె పట్టేస్తుంది.

తనతో పాటు పరిశ్రమకు వచ్చిన కాజల్ సైతం స్లో అయ్యింది. 2020లో వివాహం చేసుకున్న కాజల్ వ్యక్తిగత కారణాలతో కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదు. ప్రెగ్నెన్సీ నేపథ్యంలో ఆమె కొంత విరామం తీసుకున్నారు. తమన్నా మాత్రం అసలు తగ్గేదేలే అంటుంది. మరి ఇన్నేళ్లు స్టార్ గా ఉన్న తమన్నా సంపాదన ఎంత? ఆమె ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టారు? అనే సందేహం అందరిలో ఉంది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
తమన్నా దగ్గర అరుదైన వజ్రాలతో పాటు విలువైన ఆభరణాలు, లగ్జరీ కార్లు ఉన్నాయట. అలాగే ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఆమెకు సొంత ఇళ్ళు ఉన్నాయట. తమన్నా ఒక్కో సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటుంది. ఆమె పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఐటెం సాంగ్ చేస్తే రూ. 60 లక్షలు తీసుకుంటున్నారు. ఐపీఎల్ ఆరంభ వేడుకలో ఆడిపాడిన తమన్నా 10 నిమిషాల పెర్ఫార్మన్స్ కి రూ. 50 లక్షలు తీసుకున్నారు. సినిమాలు, ఎండార్స్మెంట్ ద్వారా నెలకు కోటి రూపాయలు తగ్గకుండా ఆమె సంపాదిస్తున్నారట. అంటే ఏడాది రూ. 12 కోట్లు ఆర్జిస్తున్నారు.

2015 నుండి తమన్నా జ్యువెలరీ వ్యాపారం చేస్తున్నారు. వైట్ అండ్ గోల్డ్ అనే బ్రాండ్ నేమ్ తో జ్యువెలరీ డిజైనర్ బ్రాండ్ ఉంది. ఇక తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువైన వజ్రం ఒకటి ఉంది. అది ఉపాసన ఆమెకు బహుమతిగా ఇచ్చారట. అలాగే ముంబైలోని ఖరీదైన ఏరియాలో రూ. 16 కోట్లు విలువ చేసే ఒక ప్లాట్ ఉంది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కూడా ఆమెకు సొంత ఇళ్ళు ఉన్నాయని సమాచారం. ఇక ల్యాండ్ రోవర్, బెంజ్, బి ఎం డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు తమన్నా వద్ద ఉన్నాయి. మొత్తంగా తమన్నా ఆస్తుల విలువ రూ. 110 కోట్లకు పైమాటే అంటున్నారు.