Suryakumar Yadav- Pakistan Legends: మిస్టర్ 360.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ను కీర్తిస్తున్న పేరు ఇదీ. ప్రపంచంలోనే మేటి ఆటగాడు విరాట్ కోహ్లీకి సైతం సాధ్యం కానీ షాట్లు ఆడుతూ మైదానం నలుమూలాల కొట్టగల సత్తా మన సూర్యకుమార్ యాదవ్ సొంతం. నిన్న దక్షిణాఫిక్రాతో 40 పరుగులలోపే 5 వికెట్లు పడితే టీమిండియాకు 130 పైగా పరుగులు సాధించిపెట్టిన ఘనత సూర్యసొంతం. బలమైన సౌతాఫ్రికా పేస్ ను ఎదుర్కోలేక టీమిండియా టాప్ ఆర్డర్ అంతా చతికిలపడ్డ వేళ సూర్య మాత్రం వారిపై విరుచుకుపడి 40 బంతుల్లోనే 68 పరుగులు చేసిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.

సూర్యకుమార్ ఆడిన విధానంపై మన శత్రుదేశం నుంచి కూడా ప్రశంసలు దక్కడం విశేషం. తాజాగా టీమిండియా కప్ కొట్టదంటూ తన అక్కసు వెళ్లక్కిన పాక్ దిగ్గజ బౌలర్ షోయాబ్ అక్తర్ సైతం మన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపించాడు. ఇక ఈరోజు పాక్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ సైతం సూర్యకుమార్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. సూర్యకుమార్ బౌలర్ మనసుతో కూడా ఆడగలడు అంటూ షోయబ్ మాలిక్ ఆకాశానికెత్తేశాడు.
బౌలర్ల మనసుతో ఆడే సత్తా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఉందని పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ అన్నాడు. “సూర్యకుమార్ ఆడే షాట్, వెనుకాల నుంచి కొట్టే షాట్.. అతని టెక్నిక్ చాలా బాగుంది, అతను ఆ ఎలివేషన్ పొందకపోయినా, అతను దానిని ఎగ్జిక్యూట్ చేయగలడు” అని మాలిక్ చెప్పాడు.

క్రికెట్ లోకి వచ్చే అన్ని దేశాల కొత్త క్రికెటర్లు సూర్యకుమార్ ఆడే షాట్లను నేర్చుకోవాలని మాజీ పేసర్ వసీం అక్రమ్ అన్నాడంటే మన సూర్య సామర్థ్యాలు అర్థం చేసుకోవచ్చు. ఇలా వరుసగా ముగ్గురు పాక్ దిగ్గజాలు టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ ను పొగిడారంటే మనోడి శక్తి సామర్థ్యాలు ఏ లెవల్ లో ఉన్నారో అర్థమవుతున్నాయి.